»   » ఆ సూపర్ హిట్ సినిమా నవలా రూపంలో..

ఆ సూపర్ హిట్ సినిమా నవలా రూపంలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెకె రోలింగ్ అనే రచయిత్రి రాసిన నవలల ఆధారంగా వచ్చిన హ్యారీ పోటర్ సినిమాలు ఏ స్థాయిలో విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలు హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కరిపించి సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు దీనికి రివర్స్ లో ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా, నభూతోనభవిష్యత్ అనే రీతిలో కలెక్షన్లను రాబట్టిన జేమ్స్ కామెరూన్ సినిమా 'అవతార్' ఇప్పుడు నవలా రూపం దాల్చనుంది. ఈ నవలని అవతార్ ను సృష్టించిన జేమ్స్ కామెరూన్ రాస్తుండటం విశేషం.

పాండోరా అనే గ్రహంలో జరిగే ఈ కథలో ప్రకృతి, దాని ఆవస్యకత, అది ఎలా మానవజాతికి సాయపడుతుంది అనేది ప్రధాన కథాంశం. ఈ నవల అవతార్ సినిమాకు ప్రీక్వెల్ గా రానుంది. ఇందులో సైంటిస్టు అయిన సిగోర్నీ వీవర్ పాత్ర విధ్యార్థులకు ప్రకృతి రహస్యాలను, గొప్పదనాన్ని వివరించడం దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. ఇక ఇంతకు ముందు స్క్రీన్ ప్లే రైటర్ గా, స్క్రిప్ట్ రటయితగా, దర్శకుడిగా బహుముఖ పాత్రలు పోషించి మెప్పించిన కామెరూన్ నవలా రచయితగా ఏ మేరకు సఫలీకృతుడు కానున్నాడో తెలుసుకోవాలంటే ఈ ఏడాది చివర్లో ఈ పుస్తకం విడులయ్యే వరకూ ఎదురుచూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu