»   » ఆస్కార్ అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందా..!?

ఆస్కార్ అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందా..!?

Subscribe to Filmibeat Telugu

ప్రపంచ సినీరంగంలో అత్యుత్తమ పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల ఎంపికలో అన్యాయం జరిగిందా..!? అవును అనే అంటున్నాడు ఈ అవార్డుల్లో ఏకంగా 9 నామినేషన్లు పొందిన అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్. టెక్నికల్ గా అత్యద్భుతంగా వున్న తమ సినిమాకు ఆయా విభాగాల్లో న్యాయం జరిగినా, ఆ టెక్నిక్ వెనుక కష్టపడ్డ నటీనటుల్లో ఏ ఒక్కరికీ నామినేషన్ రాకపోవడం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. నామినేషన్ లు ఎంపిక చేసిన వారు తమ నటీనటుల కష్టాన్ని గుర్తించలేకపోవడం బాగాలేదని ఆయన అన్నారు.

కాగా ఇటీవలే ఆస్కార్ అవార్డుల నామినేషన్లు ప్రకటించారు. ఇందులో అవతార్ సినిమాలో నటించిన ఏ ఒక్కరికీ నామినేషన్ రాకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా కామెరూన్ ఇలా వ్యాఖ్యానించారు. అవతార్ లో నెయిత్రిగా నటించినా జియో సల్దానాకు ఉత్తమ నటి క్యాటగిరీలో, సైంటిస్టు పాత్రలో నటించిన సిగోర్నీ వీవర్ కు సహాయనటి విభాగంలో నామినేషన్ వస్తుందని భావించినట్టు ఆయన తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది. కానీ ఆయనకు నిరాశే ఎదురయింది, కారణం మిగితా సినిమాల్లో సదురు నటీనటుల నటనతో పోల్చితే అవతార్ నటులు తక్కువనే చెప్పాలి. మచ్చుకు ది బ్లైండ్ సైడ్ సినిమాలో సాండ్రా బుల్లక్ నటన, జియో సల్దానా నటనను పొల్చిచూస్తే నావీగా సల్దానా నటన బాగున్నా అవార్డు వచ్చేంతగా లేదని ఇట్టే అర్థం అవుతుంది. ఏమంటారు..?! ఏదేమైనా తన బృందం తరఫున వకాత్తా పుచ్చుకొని మాట్లాడటం కూడా తప్పేం కాదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu