»   » నిమోనియా వ్యాధే ఆమె ప్రాణాలు తీసింది..!!

నిమోనియా వ్యాధే ఆమె ప్రాణాలు తీసింది..!!

Subscribe to Filmibeat Telugu

దివంగత హాలీవుడ్ నటి 'క్లూలెస్' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న తార బ్రిటానీ ముర్ఫి గత ఏడాది డిసెంబరు 20వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఈమె మరణానికి రకరకాల కారణాలు వినిపించాయి. తాజాగా వెలువడిన మెడికల్ రిపోర్ట్ ఆమె మరణానికి అసులు కారణాన్ని వెళ్లడించింది. నిమోనియాతో బాధపడుతున్న ఆమెను అదే వ్యాధి పొట్టనపెట్టుకుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యాధికి తోడు ఆమె వాడిన డ్రగ్స్ కూడా ఇందుకు సహకరించడంతో ఆమె హఠాత్తుగా మరణించిందని ఈ నివేదిక సారాంశం. కానీ ఆమె వాడిన, ఆమె మృతికి కారణమయిన డ్రగ్స్ వివరాలను మాత్రం వారు వెళ్లడించలేదు.

ఇక ఈమె ఒక్కరోజు ముందు డాక్టరును సంప్రదించినా పరిస్థితి వెరేలా వుండేదని, కానీ సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ఆమె మరణించిందని తెలిపారు. కాగా ఆమె చనిపోనియిన రెండు రోజుల తర్వాత రోజుకు ఆమె ఫిజీషియన్ అపాయింట్ మెంట్ తీసుకుందని కానీ అంతలోనే మృత్యువు ఆమెను కబలించిందని వారీ నివేదికలో పేర్కొన్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu