»   » సింగర్ హత్యతో ఉలిక్కిపడ్డ సంగీత ప్రపంచం

సింగర్ హత్యతో ఉలిక్కిపడ్డ సంగీత ప్రపంచం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫ్లోరిడా: హాలీవుడ్ సింగర్, 'ది వాసియస్' స్టార్ క్రిస్టినా గ్రిమ్మీ(22) హత్యతో పాప్ సంగీత ప్రపంచం ఉలిక్కిపడింది. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో ఇటీవల జరిగిన 'బి ఫోర్ యూ ఎగ్జిట్' షో ముగిషాక ఆటోగ్రాఫులు ఇస్తున్న సమయంలో కెవిన్ జేమ్స్ అనే వ్యక్తి ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

క్రిస్టినా గ్రిమ్మీ మరణంపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసాడు. బ్లేక్ షెల్టన్, ఆడమ్ లివైన్, సెలెనా గోమెజ్, డెమీ లొటావో తదితర సెలబ్రిటీలు సంతాపం ప్రకటించారు. క్రిస్టినా మరణం తనను ఎంతగానో కలిచివేసిందని గోమెజ్ తెలిపారు. క్రిస్టినాకు కన్నీటితో నివాళి అర్పించింది. తన పాటల్లో ఒకటి ఆమెకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది.

suscide

క్రిస్టినా మరణంపై లొటావో స్పందిస్తూ... క్రిస్టినా మరణవార్త విని తన హార్ట్ గాయపడిందని, ఆమెను హత్య చేయడం దారుణమని ట్వీట్ చేసారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. క్రిస్టినా కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థనలు చేస్తున్నట్లు నిక్ జోనాస్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

క్రిస్టినా మరణం తనను షాక్ కు గురి చేసిందని ఆడమ్ లివైన్ ట్వీట్ చేసారు. క్రిస్టినా సంఘటనపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని సింగర్ టోరీ కెల్లీ అన్నారు. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

English summary
The violent death of Christina Grimmie has left her supporters in mourning. Celebrities immediately took to social media after learning that the 22-year-old Season 6 finalist on "The Voice" was shot and killed Friday during a fan meet-and-greet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu