»   » ఎయిడ్స్ ఉందని ఒప్పుకున్న ప్రముఖ నటుడు, 66 కోట్ల ఖర్చు!

ఎయిడ్స్ ఉందని ఒప్పుకున్న ప్రముఖ నటుడు, 66 కోట్ల ఖర్చు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు ప్రాణాంతక హెచ్ఐవి బారిన పడ్డాడంటూ గత కొంత కాలంగా హీలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అతడికి హాలీవుడ్ సర్కిల్ లో ప్లేబాయ్ గా పేరుంది. పలువురు హీరోయిన్లు, పోర్న్ స్టార్లతో లైంగిక సంబంధాలు ఉండటంతో వారికి కూడా హెచ్ఐవి సోకి ఉంటుందనే విషయం అందరినీ హడలెత్తించింది.

దాదాపు 15 రోజుల పాటు మీడియా హడావుడి అనంతరం... హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ ఎట్టకేలకు తానే స్వయంగా టీవీ షోలో విషయం ఒప్పుకున్నాడు. తనకు నాలుగేళ్ల క్రితమే ఎయిడ్స్ ఉందని నిర్దారణ అయిందని, తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాయితీగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

Charlie Sheen says he is HIV-positive

ఈ నాలుగేళ్ల పాటు ఈ రహస్యాన్ని దాచడానికి, విషయం బయట పెడతానని తనను బ్లాక్ మెయిల్ చేసిన వారికి రూ. 66 కోట్ల వరకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఉద్దేశ్య పూర్వకంగానే ఇతరులకు హెచ్ఐవి అంటించాడని, తనకు గల వ్యాధి వివరాలను దాచి లైంగిక సంబంధాలు కొనసాగించాడని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే అతనితో గడిపిన మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సన్... చార్లీ షీన్ తనతో ఎప్పుడూ హెచ్ఐవి ఉందన్న విషయం చెప్పలేదని, ఐయామ్ క్లీన్ అని చెప్పేవాడని, ఉద్దేశ్య పూర్వకంగానే అతడు విషయాన్ని దాచాడని చెప్పడం గమనార్హం. టెస్టుల్లో తనకు హెచ్ఐవి నెగెటివ్ అని వచ్చిందని ఆమె వెల్లడించింది. అయితే ఆమె ఆరోపణలను చార్లీ షీన్ ఖండించారు. ఆమెతో విడిపోయే నాటికి హెచ్ఐవి ఉందనే విషయం నాకు కూడా తెలియదని తెలిపారు.

మీడియాలో హల్ చల్
15 రోజుల పాటు ఎయిడ్స్ సోకిన ఆ మిస్టరీ స్టార్ ఎవరనే విషయం వార్తల్లో నలిగింది. ఎట్టకేలకు అతడు చార్లీ షీన్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ మాలీవుడ్ వార్త సంస్థలు యూఎస్ఏ టుడే, టిఎంజెడ్, హాలీవుడ్ రిపోర్టర్ ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టాయి. ఈ టాపిక్ ట్విట్టర్ తో పాటు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండింగ్ అయిపోయింది. చార్లీ షీన్ స్వయంగా తనకు హెచ్ఐవి ఉందనే విషయం టీవీ షోలో బయట పెట్టడంతో ఈ వివాదానికి తెరపడింది.

English summary
Actor Charlie Sheen told NBC's "Today" show Tuesday that he was diagnosed as HIV-positive about four years ago, and that a few people who knew it demanded money from him to keep the secret.
Please Wait while comments are loading...