అవెంజర్స్ మూవీ హీరోతో.... ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గెర్ కూతురు వివాహం (ఫోటోస్)
హాలీవుడ్ యాక్షన్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గెర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలకు సంబంధించిన అంశాలతో వార్తల్లో ఉండే ఆర్నాల్డ్ తాజాగా తన కూతురు వివాహానికి సంబంధించి న్యూస్‌తో తాజాగా హాట్ టాపిక్ అయ్యాడు.
ఆర్నాల్డ్ కూతురు కేథరిన్ స్వార్జ్‌నెగ్గెర్ వివాహం 'అవెంజర్స్', 'ది గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' చిత్రాల హీరో క్రిస్ ప్రాట్‌తో జరిగింది. అమెరికాకు చెందిన పీపుల్ మేగజైన్ కథనం ప్రకారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని మోంటెసిటో వీరి వివాహం సన్నిహితులు, బంధువుల సమక్షంలో ప్రైవేట్‌గా జరిగినట్లు తెలుస్తోంది.

కూతరు పెళ్లికి ఆర్నాల్డ్ హాజరు కాలేదా?
ఈ పెళ్లి వేడుకకు క్రిస్ ప్రాట్ ఆరేళ్ల కుమారుడు జాక్, అతడి మాజీ భార్య అన్నా పారిస్, స్వార్జ్‌నెగ్గెర్ సిబ్లింగ్స్ పాట్రిక్, క్రిస్టోఫర్, క్రిస్టియానా, క్లోజ్ ఫ్రెండ్ రోబ్ లోవె, అతడి కుమారులు జానీ, మాథ్యూ హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఆర్నాల్డ్ ఈ పెళ్లి వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది.

అతడికి రెండో వివాహం
తమ ఎంగేజ్మెంట్ జరుగడానికి ఏడు నెలల ముందు నుంచే క్రిస్ ప్రాట్, కేథరిన్ డేటింగ్ చేస్తున్నారు. జనవరిలో తమ ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కేథరిన్‌తో క్రిస్ ప్రాట్‌కు ఇది రెండో వివాహం. అంతకు ముందు అన్నా పారిస్‌ను పెళ్లాడిన అతడు 2017లో విడిపోయాడు.

వైరల్ అవుతున్న ఫోటోస్
వీరి వివాహానికి సంబంధించిన లీక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఫీషియల్‌గా ఇంకా ఎలాంటి ఫోటోలు విడుదల కాలేదు. అయితే కూతురు వివాహానికి ఆర్నాల్డ్ హాజరయ్యాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

క్రిస్ ప్రాట్
క్రిస్ ప్రాట్ సినిమాల విషయానికొస్తే.... అతడు చివరగా ఇటీవల విడుదలైన ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' మూవీలో స్లార్ లార్డ్ పాత్రలో నటించాడు. కేథరిన్ స్వార్జ్‌నెగ్గెర్ రచయితగా కొనసాగుతున్నారు. ఇద్దరూ ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన వారు కావడం, తరచూ పార్టీల్లో కలుస్తుండటంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి చివరకు వివాహానికి దారి తీసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











