బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ బేల్‌, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరస్ మిలిసా లియో

By Nageswara Rao

83వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఫిబ్రవరి 27న అట్టహాసంగా జరిగాయి. ఈసారి ఆస్కార్ బరిలో అనుకున్న విధంగానే ద కింగ్స్ స్పీచ్ సినిమాకిగాను ఎక్కువ అవార్డులను సోంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలో నటించినటువంటి కోలిన్ ఫిర్త్‌కి బెస్ట్ లీడింగ్ హీరో అవార్డుని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా బ్రటిష్ యాక్టర్ క్రిస్టియన్ బేల్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌ అవార్డుని కైవసం చేసుకున్నారు. ద ఫైటర్ అనే సినిమాలో ప్రాబ్లమాటిక్ బాక్సింగ్ బ్రదర్‌గా నటించినటువంటి నటనకుగాను క్రిస్టియన్ బేల్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వడం జరిగింది.

క్రిస్టియన్ బేల్‌కు గతంలో ఈసినిమాలో నటించినటువంటి నటనకుగాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా సోంతం చేసుకున్నారు. ఇక ఈ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నామినేషన్స్‌లలో క్రిస్టియన్ బేల్‌తో పాటు ద కింగ్స్ స్పీచ్ సినిమాలో నటించిన జియోఫరీ రష్, ద టౌన్ సినిమాలో నటించిన జెరిమి రెన్నర్ పోటీ పడ్డారు. ఇక క్రిస్టియన్ బేల్ ద ఫైటర్ సినిమాలో డుకీ ఎక్లాండ్ అనే పాత్రని పోషించారు. ఇందులో క్రిస్టియన్ బేల్ తన సోదరుడికి బాక్సింగ్ నేర్పించేటటువంటి ట్రైనర్‌గా ముఖ్య భూమికను పోషించారు.

ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్టరస్ విషయానికి వస్తే మిలిసా లియో ద ఫైటర్ అనే సినిమాలో నటించినటువంటి నటనకుగాను సోంతం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి మిలిసా లియో రాలేకపోవడం వల్ల ఆ అవార్డుని ద ఫైటర్ సినిమాలో కోస్టార్‌గా నటించినటువంటి ఆమి ఆడమ్స్ తీసుకోవడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X