»   » ఆ రీమేక్ ను ఉతికిఆరేసిన రివ్యూలు

ఆ రీమేక్ ను ఉతికిఆరేసిన రివ్యూలు

Subscribe to Filmibeat Telugu

1981లో వచ్చిన సైంటిఫిక్ మూవీ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమా అప్పట్లో ఘనవిజయాన్ని సాధించి రికార్డులను సృష్టించింది. ఇప్పుడా సినిమాను అదే పేరుతో రీమేక్ చేసి విడుదలచెయ్యనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రేపు(ఏప్రిల్ 2న) విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ ప్రీమియర్ షో నిన్నరాత్రి జరిగింది. ఈ షో తరువాత విడుదలైన రివ్యూలు ఈ సినిమాను ఉతికి ఆరేసాయి. పాత సనిమాతో పోల్చితే ఈ సినిమాలో 3డి ఎఫెక్ట్స మాత్రమే బాగున్నాయని ఈ రివ్యూలు ఘోషించాయి.

ఇక ఈ సినిమాలో గత సంవత్సరం టర్మినేటర్ సాల్వేషన్, అవతార్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్యామ్ వర్తింగ్టన్ ప్రధాన పాత్రలో నటించాడు. మొత్తంగా 103 నిమిషాల పాటు నడిచే ఈ సినిమాకు చాలా రివ్యూలు నాలుగు స్టార్ లకు గాను ఒకటి నుండీ రెండు స్టార్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా రేపే విడుదల కానుంది.

Please Wait while comments are loading...