»   » గాజు పెంకుతో కోసుకుని ఛస్తా అని బెదిరించినా, హీరో ని ఒప్పించారు, ఏం చేసారో

గాజు పెంకుతో కోసుకుని ఛస్తా అని బెదిరించినా, హీరో ని ఒప్పించారు, ఏం చేసారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ ఏంజిల్స్‌: 'మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా' అని డేనియల్ క్రెగ్ ఆ మధ్యన వ్యాఖ్యానించారు. అయితే సీన్ మారింది.

కొద్ది కాలం క్రితం.. 674 కోట్ల రూపాయల రెమ్యునేషన్ ఇస్తానన్నా జేమ్స్ బాండ్ సినిమా చేయనని చెప్పేశాడు 'స్పెక్టర్' హీరో డేనియల్ క్రెగ్. జేమ్స్‌ బాండ్‌ గా నటించడం కన్నా చేతి మణికట్టును కోసుకుని చావడం బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన డేనియల్ క్రెగ్ ఆ భారీ ఆఫర్ ను తిరస్కరించాడు. అయితే ఇప్పుడు ఆయన్ని ఆ పాత్రకు ఒప్పించారని తెలుస్తోంది.

జేమ్స్‌బాండ్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెగ్‌. బాండ్‌ సిరీస్‌లో వచ్చిన 'క్యాసినో రాయల్‌', 'క్వాంటమ్‌ ఆఫ్‌ సొలెస్‌', 'స్కైఫాల్‌', 'స్పెక్టర్‌' చిత్రాలు క్రెగ్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ చిత్రాల తర్వాత ఇక తాను బాండ్‌ సిరీస్‌లో నటించనని క్రెగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే.

Could this convince Daniel Craig to play Bond again?

అయితే తాజాగా మళ్లీ బాండ్‌ చిత్రంలో క్రెగ్‌ నటించే అవకాశం ఉందట. క్రెగ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఒథెల్లో' నిర్మాత అతనిని ఒప్పించినట్లు తెలుస్తోంది. మరి క్రెగ్‌ జేమ్స్‌బాండ్‌గా కనిపిస్తాడో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ 'స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా 'స్పెక్టర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి జేమ్స్ బాండ్ సినిమా వస్తోంది.

పపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కించుకోవాలంటే మామూలు విషయం కాదు. నటనతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్నీ పర్ ఫెక్టుగా పండించగలగాలి. అంతకంటే ముఖ్యంగా ముఖ్యంగా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే విధంగా తెరపై సాహస విన్యాసాలు పండించగలగాలి. ఇవన్నీ చేయడానికి తెర వెనక ఎంత కష్టం, శ్రమ దాగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

English summary
Actor Daniel Craig might play popular fictional character James Bond again. The 'Spectre' actor could be convinced to sign up for another 007 movie by the producer of his latest theatre project, 'Othello', reported AceShowbiz.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu