»   »  నిర్మాతలు వందల కోట్ల ఆఫర్ ఇచ్చినా రిజక్ట్ చేసాడు, ఎందుకు?

నిర్మాతలు వందల కోట్ల ఆఫర్ ఇచ్చినా రిజక్ట్ చేసాడు, ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ ప్రాంచైజీ సినిమాలు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ సిరీస్ లో వచ్చే సినిమాలు దేనికదే ప్రత్యేకంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి సినిమాల్లో అవకాశం దక్కడమే అదృష్టంగా భావిస్తారు చాలా మంది. అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చినా, వందల కోట్లు పారితోషికంగా ఇస్తానన్నా రిజెక్ట్ చేసాడు హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్.

Also Read: 'జేమ్స్ బాండ్' హీరో రహస్య వివాహం బట్ట బయలు

గత నాలుగు జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలైనప కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్రైఫాల్, స్పెక్టర్ చిత్రాల్లో డేనియల్ క్రేగ్ హీరోగా నటించాడు. మరో రెండు సినిమాల్లో నటించాలని ఈ చిత్రాలను నిర్మించే ఎంజిఎం సంస్థ అతనికి ఆఫర్ చేసింది ఇందకు గాను. 100 మిలియన్ అమెరికన్ డాలర్లు ఆఫర్ చేసింది.

Daniel Craig refused $100 Million offer!

అయితే తాను ఇకపై ఈ సినిమాల్లో నటించబోనని డేనియల్ క్రేగ్ ఆ ఆఫర్ తిరస్కరించాడట. డేనియల్ క్రెగ్ కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధ పడుతున్నాడని... ఈ పరిస్థితుల్లో మరో జేమ్స్ బాండ్ సినిమా కోసం సిద్ధం కావడం తన వల్ల కాదని తేల్చి చెప్పాడట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డేనియర్ క్రెగ్ మాట్లాడుతూ 'మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా' అని వ్యాఖ్యానించారు. మరోసారి నన్ను చేయమని అడిగితే రెండేళ్లు ఆగమంటాను. రెండేళ్ల తర్వాత ఒక వేళ చేయాలని అనిపిస్తే... అది డబ్బు కోసమే తప్ప మరో కారణం ఉండదు అన్నాడు.

English summary
Daniel Craig who featured in four Bond films (Casino Royale, Quantum of Solace, Skyfall, Spectre) already has done the same. Inspite of the over $100 million (could be $129M) offer from the Production Company MGM, He refused to sign a two film deal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu