For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వారిద్దరు సెక్స్ చేసుకొంటే.. నాకు అవార్డు.. తల్లి ముందే దారుణంగా ఆస్కార్ విజేత స్పీచ్..

  |

  93వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం నిరాడంబరంగా తారళ తళుకుబెళుకుల మధ్య ముగిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమం కరోనావైరస్ కారణంగా బోసిపోయినట్లే కనిపించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం కొంత మందికే అనుమతి లభించగా.. పలువురు జూమ్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఈ వేడుకను వీక్షించారు. ఈ వేడుకలో జరిగిన ఆసక్తికరమైన విషయాలతోపాటు ఆస్కార్ విజేత కాలుయా స్పీచ్‌లోకి వెళితే...

  కరోనా సమయంలో క్లినిక్‌లోకి కరీనా.. కెమెరా కంటికి చిక్కిన బ్యూటీ

   ఉత్తమ సహాయ నటుడిగా కాలుయా

  ఉత్తమ సహాయ నటుడిగా కాలుయా

  బ్రిటన్‌కు చెందిన డేనియల్ కాలుయా గత కొద్దికాలంగా తన నటనతో ఆకట్టుకొంటున్నారు. ఇటీవల నటించిన జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్యా చిత్రంలో ఆయన ఫెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జుడాస్‌లో బ్లాక్ పాంథర్ యాక్టివిస్టు పాత్రలో నటనకు గాను ఉత్తమ సహయ నటుడి అవార్డు ఆయనను వరించింది.

   ఎంతో శ్రమించాను అంటూ..

  ఎంతో శ్రమించాను అంటూ..

  జుడాస్ అండ్ బ్లాక్ మెస్సయ్యా చిత్రంలో నటించడానికి తాను ఎంతో కష్టపడ్డాను. ఆ పాత్ర కోసం రకరకాల పరిశోధన చేశాను. నేను పడిన కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. అందుకు ముందుగా నా తల్లికి, ఆ తర్వాత దర్శకుడు, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

  అమ్మ, నాన్న శృంగారం వల్లే

  అమ్మ, నాన్న శృంగారం వల్లే

  నా జీవితంలో మా అమ్మ నాన్నలు కలవడం అనేది ఓ అద్భుతం. వారిద్దరి సెక్స్ చేసుకొన్న ఫలితంగా నేను మీ ముందు ఉన్నాను. నేను ఏమంటున్నానో మీకు తెలుసుగా? నేను ఇక్కడ మీ ముందు ఉన్నానంటే ఎవరు కారణమో చెప్పాలనుకొంటున్నాను. ఇలా మీరు నాకు జన్మను ప్రసాదించినందునే ఈ గౌరవం దక్కింది. ఈ రోజు రాత్రి వేడుకను బ్రహ్మండంగా జరుపుకొంటాను అని డేనియల్ కాలుయా స్పీచ్‌లో భావోద్వేగానికి గురయ్యారు.

   నా పుట్టుకకు కారణమైన తల్లి వల్లే...

  నా పుట్టుకకు కారణమైన తల్లి వల్లే...

  నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా మా అమ్మ కారణం. నాకు ఏం కావాలో అవన్నీ పుట్టుకతోనే ఇచ్చావు. నీలో ఉండే ప్రతిభను నాకు పుట్టుక ద్వారా ధారపోశావు. దాంతోనే ఈ స్థాయిలో రాణిస్తున్నాను. నా కాళ్లపై నేను నిలబడేలా నీవు చేశావు అంటూ డేనియల్ కాలుయా పేర్కొన్నారు. దీంతో వేదిక వద్ద ఉన్న డేనియల్ తల్లి కొంత అసౌకర్యానికి గురయ్యారు.

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
  93వ ఆస్కార్ విజేతలు వీరే...

  93వ ఆస్కార్ విజేతలు వీరే...

  భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ పిక్చర్: నోమ్యాడ్‌లాండ్, బెస్ట్ డైరెక్టర్: చో జావో (నోమ్యాడ్‌లాండ్), బెస్ట్ యాక్టెస్: ఫ్రాన్సెస్ మెక్‌బోర్మాండ్ (నోమ్యాడ్‌లాండ్),

  బెస్ట్ యాక్టర్: ఆంథోని హాప్‌కిన్స్ (ది ఫాదర్), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: డేనియల్ కాలుయా (జుడాస్), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: యూ జంగ్ యూన్ (మిన్నారి), బెస్ట్ స్క్రీన్ ప్లే: ప్రామిసింగ్ యంగ్ ఉమెన్‌గా తమ అవార్డులను గెలుచుకొన్నారు.

  English summary
  Oscars 2021 Moment: Britain actor Daniel Kaluuya has wins Best Supporting Actor for Judas and the Black Messiah. In this occassion, Kaluuya made contraversial speech at Oscar 2021 event which happend in Los Angels.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X