twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ అవార్డుని మంచం క్రింద దాచిపెట్టినటువంటి డైరెక్టర్ ఎవరబ్బా..?

    By Nageswara Rao
    |

    స్లమ్ డాగ్ మిలినియర్‌తో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం తనవైపుకు తిప్పుకున్న డైరెక్టర్ డానీ బోయెల్. ఆస్కార్ మహొత్సవంలో ఈసినిమా సృష్టించినటువంటి హాడావుడి అంతా ఇంతా కాదు. మొట్టమొదటిసారి ఓ భారతీయుడికి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టనటువంటి సినిమా ఇది. 2008వ సంవత్సరంలో విడుదలైనటువంటి ఈసినిమా ప్రపంచం మొత్తం బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసింది. అందుకే ఈసినిమాకి 2008వ సంవత్సరానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డుని స్వీకరించారు డానీ బోయెల్.

    సాధారణంగా ఎవరైనా ఇలాంటి అత్యున్నతమైన అవార్డుల్ని స్వీకరించినప్పుడు ఇంటిలోని కప్ బోర్డ్స్‌లో దాచుకోవడం విన్నాం.. కానీ మన డానీ బోయెల్ ఆస్కార్ అవార్డుని మాత్రం తన మంచం క్రింద చిన్న షూ బ్యాగ్ లాంటిది ఏర్పరచి అందులో దాచుకుంటానని ఇటీవలే వివరించారు. ఇలాంటి చేష్టలకి ఆయన అభిమానులు నవ్వుకున్నారు. దీనికి కారణాన్ని కూడా డానీ బోయెల్ తనదైన శైలిలో వివరించారు.

    ప్రతిరోజు తను లేవగానే తన మంచం క్రింద ఉన్నటువంటి ఆ ఆస్కార్ అవార్డుని తనివితీరా చూసుకోవడానికే తన మంచం క్రింద పెట్టుకున్నానని అన్నారు. ఎందుకంటే ఆఆస్కార్ అవార్డు నాజీవితంలో అలా కలసిపోయందని అన్నారు. దేనిని అయినా వదిలిపెట్టవచ్చుకానీ ఇలాంటి అవార్డుని మాత్రం వదిలి పెట్టలేమని అన్నారు. అంతేకాకుండా ఈసంవత్సరం కూడా డానీ బోయెల్ ఆస్కార్ బరిలో ఉన్నారు. తాను తీసినటువంటి 127 అవర్స్ అనేసినిమాకు గాను బెస్ట్ ఎడాప్టడ్ స్కీన్ ప్లే కేటగిరి క్రింద నామినేట్ అవ్వడం జరిగింది. ఈసంవత్సరం కూడా డానీ బోయెల్‌కి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుందాం..

    English summary
    Director Danny Boyle has revealed that he keeps his Oscar hidden under his bed at home. The Brit won the Best Director Oscar in 2008 for ''Slumdog Millionaire,'' but, after having the honour on display at home for a while, he decided to store it away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X