నెక్ట్స్ జేమ్స్ బాండ్ హీరో...ఆయనేనా?

మరి డేనియల్ క్రెగ్ తర్వాత ఎవరు? అంటే తన భర్తే అంటోంది సింగర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన విక్టోరియా బెక్ హామ్. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్ భార్య అయిన విక్టోరియా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఈ జంట.
డేవిడ్ బెక్‌హామ్ మాట్లాడుతూ...'హాలీవుడ్ నటుల్లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. టామ్ క్రూయిజ్ మాకు చాలా మంది స్నేహితుడు. కానీ నటుడిని కావాలని నేనెప్పుడూ ఆలోచించలేదు. నటుడిగా నేను సరిపోతానో లేదు కూడా నాకు కచ్చితంగా తెలియదు' అని బదులిచ్చారు. వెంటనే ఆయన భార్య విక్టోరియా స్పందిస్తూ...'నటన విషయంలో నువ్వు వెరీ గుడ్' అంటూ వ్యాఖ్యానించింది.
'జేమ్స్ బాండ్ పాత్రలుక డేవిడ్ బెక్ హామ్ బాగా సూటవుతాడు. ఆయన ఆ పాత్రలు చాలా గొప్పగా చేయగలుగుతాడు' అని విక్టోరియా అంటోంది. జేమ్స్ బాండ్ సినిమాల ఫ్రాంచైజీ ఓకే అన్నాకే వీరు మీడియాకు ఈ విషాన్ని కావాలని లీక్ చేసారా? లేక ఇది వీరి సొంత అభిప్రాయమా? తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











