Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యాషన్ గా ఉండడం నాకు చిన్నప్పటి నుండే అలవాటు..!
వంద ఛాంపియన్స్ లీగ్స్ ఆడిన ఒకేఒక బ్రిటిష్ ఆటగాడు, ఫిఫా వరల్డ్ కప్ లో రెండు సార్లు రన్నరప్ గా నిలిచారు. 2004 సంవత్సరంలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే ఆటగాడిగా ప్రసిధ్ది చెందారు. అంతేకాకుండా యాడ్స్ ద్వారా ఎక్కువ డబ్బులు తీసుకోని అందులో కూడా రికార్డు సాధించారు. 2003-2004లో గూగులో సెర్చ్ ఇంజన్ లో ఎక్కువ సార్లు సెర్చ్ చేసిన స్పోర్ట్స్ ఆటగాడిగా ప్రసిధ్ది చెందారు. దానితో సంతృప్తి చెందకుండా 2007 సంవత్సరంలో యావత్ ప్రపంచం మొత్తానికి ఒక యూత్ అండ్ ఫ్యాషన్ ఐకాన్ గా ఎన్నికయ్నారు. ఆయనే మన స్టార్ పుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెకహాం. ప్రస్తుతం డేవిడ్ బెకహాం మేజర్ లీగ్ సాకర్ లో లాస్ఎంజెల్స్ గెలాక్సి తరుపున ఆడుతున్నాడు. అంతక ముందు మాంచెస్టర్ యునైటెడ్, రిల్ మాడ్రిడ్, మిలాన్ మరియు ఇంగ్లాండ్ నేషనల్ టీమ్ తరుపున ఆడాడు. ఈయన గుండు చేయించుకుంటే ఫ్యాషన్, పిలకేస్తే ఫ్యాషన్, టాటూ వేయిస్తే ఫ్యాషన్ అసలు ఒకానోక సమయంలో డేవిడ్ బెకహాం ఏమి చేసిన ఫ్యాషన్ అంటే నమ్మశక్యం కాదంటే నమ్మండి. డేవిడ్ బెకహాం విక్టోరియాని పెళ్శి చేసుకోవడం జరిగినది. వీరికి ముగ్గురు పిల్లలు.
ఇంతకీ మనం ఈయన గారి గురించి మాట్లాడుకోవడానికి కారణం డేవిడ్ బెకహాం చిన్నప్పటి నుండే అందరికి ఫ్యాషన్ ఐకాన్ అంట. ఇటీవల డేవిడ్ బెకహాం మాట్లాడుతూ నేను 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్శిలో నన్ను అందరూ పేజీబాయ్ ని చేసేవారు. నాకు రెండు సూట్ లు ఉండేవి, అందులో నేను నైకర్ బాకర్స్ ని తీసుకునేవాడిని. నైకర్ బాకర్స్ లో లాంగ్ వైట్ సాక్స్, బాలెట్ షూస్ మరియు బాలెట్ స్లిప్పర్స్ ఉంటాయి. అంతేకాకుండా నేను చిన్నప్పటి నుండి చూడడానికి కూల్ అండ్ సింపుల్ గా ఉండేవాడిని. నేను ఎక్కువగా సూట్స్ వేసుకోవడానికి ఇష్టపడతాను. కాని ఆటలు, యాడ్స్ కోసం ఎక్కువసార్లు జీన్స్, టీషర్ట్స్ వేసుకోవాల్సి వస్తుంది. నాకు చిన్నప్పటి నుండే నాకు నప్పే బట్టలు మాత్రమే వేసుకునేవాడినని చెప్పారు. ఇదంతా నాకు సహాజంగానే చిన్నప్పటి నుండే అలవడిందని ఆయన వెల్లడించారు.