»   » మంచి మగాళ్లను నమ్మను అంటూ... దీపిక ‘xXx’ ఫస్ట్‌లుక్ పోస్టర్

మంచి మగాళ్లను నమ్మను అంటూ... దీపిక ‘xXx’ ఫస్ట్‌లుక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ 'xXx-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కేవలం దీపిక ముఖంతో ఈ పోస్టర్ రిలీజ్ చేసారు.

'మంచి మగాళ్ల మీద తనకు నమ్మకం లేదు' అని దీపిక అభిప్రాయ పడ్డట్లు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ బట్టి సినిమాలో దీపిక పదుకోన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్ కూడా డిఫరెంటుగా ఉంది. బాలీవుడ్లో తన సెక్సీ అందాలతో అదరగొట్టిన దీపిక హాలీవుడ్ మూవీ పోస్టర్ మరింత సెక్సీగా ఉంటుందని అంతా భావించారు. కానీ దీపికను నేరుగా చూపించకుండా ఆమె బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ తో పోస్టర్ డిజైన్ చేసారు.

ఈ సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాకు డీజే కరుసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపిక-విన్ డీజిల్ తో పాటు టోనీ జా.. శామ్యూల్ జాక్సన్.. టోనీ కొలెట్.. నినా డొబ్రెవ్.. రూబీ రోజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇదే పోస్టర్

ఇదే పోస్టర్

దీపిక పదుకోన్ ‘xXx' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే..

ఇదే తొలి సినిమా

ఇదే తొలి సినిమా

దీపికకు ఇదే తొలి హాలీవుడ్ మూవీ. చాలా కాలంగా దీపిక హాలీవుడ్ కి వెలుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా ద్వారా హాలీవుడ్లోకి ఎంటరైంది.

హాట్ సీన్లు

హాట్ సీన్లు

ఈ సినిమా ద్వారా హాలీవుడ్లో పాగావేయాలని మరిన్ని హాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవాలని నిర్ణయించుకున్న దీపిక.... హాలీవుడ్ స్థాయిలో రొమాంటిక్ సీన్లు పండించేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర హీరో విన్ డీసెల్ తో కలిసి హాటెక్కించేలా ఇంటిమేట్ సీన్లలో నటిస్తోంది.

2017 రిలీజ్

2017 రిలీజ్

‘xXx-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.

English summary
Deepika Padukone’s face is front and centre on her character poster for her Hollywood debut opposite Vin Diesel, xXx: The Return of Xander Cage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu