»   » గన్స్, గర్ల్స్,....XXX ట్రైలర్‌ ఇదిగో..కేక పెట్టించింది

గన్స్, గర్ల్స్,....XXX ట్రైలర్‌ ఇదిగో..కేక పెట్టించింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజెల్స్‌: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె నటించిన మొదటి హాలీవుడ్‌ చిత్రం 'ట్రిపులెక్స్‌-ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌కేజ్‌' చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. దీపిక తన ట్విట్టర్‌ ద్వారా ట్రైలర్‌ను విడుదల చేసింది.

డీజే క్యారుసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విన్‌డీజిల్‌తో పాటు నీనా డోబ్రేవ్‌, రూబీ రోజ్‌లు నటించారు. జనవరి 20, 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం దీపిక భారీగా కసరత్తులు చేస్తోండగా, ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ వీడియో స్టన్నింగ్ గా ఉందంటూ దీపిక అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.మీరూ ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు.

 Deepika Padukone's XXX 3 Trailer

ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సెరెనా అనే అమ్మాయిగా దీపిక కనిపించనుండగా,ఈ చిత్రంలో దీపిక లుక్ అభిమానుల మనసులను దోచుకునేలా ఉందంటూ అభిమానులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇంక ఈ చిత్రాన్ని 2017లో విడుదల చేయనున్నట్టు సమాచారం.మరి దీపికను హాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

కెనడాలోని టొరంటోలో ద రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ఫిల్మ్ ఫేర్‌లో ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్న దీపికా గ్జాండర్ కేజ్ సినిమాలో సెరీనా పాత్రను పోషిస్తోంది. ఆ మూవీకి డీజే కరుసో దర్శకుడు. రసూల్ కార్పెంటర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం దీపికా పదుకునే బాగా కసరత్తులు చేస్తుంది. స్టంట్స్ నేర్చుకుంటోంది.

English summary
The theatrical trailer of much-awaited Hollywood biggie 'XXX: Return Of Xander Cage' starring Vin Diesel and Deepika Padukone is out.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu