హాలీవుడ్ సినిమా కోసం దీపిక పదుకోన్ ట్రైనింగ్ (వీడియో)
ముంబై: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఆమె తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం విన్ డీసెల్‌తో కలిసి దీపిక నటించబోతోంది.
గతంలో అతనితో దిగిన ఫొటోను షేర్ చేసిన దీపిక... కొన్ని రోజుల క్రితం ‘xxx' మూవీలో తాను హీరోయిన్ గా ఖరారైనట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారి కంగా ప్రకటించేవరకు దీపిక ఈ సీక్రెట్‌ను చెప్పలేదు. అటు నుండి అఫీషియల్ ప్రకటన రావడంతో దీపిక పదుకోన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

"హాలీవుడ్ ఎంట్రీపై నాకు ఎంతో ఉత్సాహంగానూ... టెన్షన్‌గానూ ఉంది. వచ్చేవారమే నా తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం వెళ్లబోతున్నా"అని దీపిక చెప్పింది. మొదట డొమినికన్ రిపబ్లిక్‌లో ‘xxx' మూవీ షూటింగ్ జరుగనుంది.
ఈ మూవీ కోసం దీపికా పదుకునే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది. సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో విన్ డీజిల్ కు పోటీగా నటించేందుకు దీపికా ఎంతోకష్టపడి శిక్షణ తీసుకుంటోంది. దీపికాపదుకునే కి ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తున్న యాస్మిన్ కరాచీవాలా శిక్షణకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











