»   » ఇప్పుడు ఇదే నెం.1: ఐదేళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆనందం నెల రోజుల్లో మాయం!

ఇప్పుడు ఇదే నెం.1: ఐదేళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆనందం నెల రోజుల్లో మాయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గంగ్నమ్ స్టైల్' పాట గుర్తుందా.... అప్పట్లో ఈ పాటతో యావత్ ప్రపంచమే ఊగిపోయింది. యూట్యూబ్ లో ఈ ఆల్బం వీడియో ఓ సంచ‌ల‌నం. సౌత్ కొరియా‌కు చెందిన సింగ‌ర్ సై గంగ్నమ్ సైల్ ఆల్బంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు.

జులై 15, 2012‌న యూట్యూబ్‌లో రిలీజ‌యిన గంగ్న‌మ్ స్టైల్ సాంగ్ గ‌త ఐదేళ్లుగా వ్యూస్ పరంగా నెం.1 పొజిషన్లోనే ఉంది. ఆ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 2.896 బలియన్(289 కోట్లు)పై చిలుకు వ్యూస్ సాధించింది. నిన్న మొన్నటి వరకు ఇదే నెం.1గా ఉండేది.... కానీ అమెరికన్ సాంగ్ ఆల్బమ్ సీ యూ ఎగైన్.... జులై 2018లో 'గంగ్నమ్ స్టైల్'ను సెకండ్ పొజిసన్లోకి నెట్టేసింది. అయితే ఐదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలు కొట్టిన ఆనందం 'సీ యూ ఎగైన్' టీంకు కనీసం నెల రోజులు కూడా లేదు.

నెల రోజుల్లోనే టాప్ 5 నుండి నెం.1 పొజిషన్లో

తాజాగా డిస్పాసిటో ఆల్బమ్ 3 బిలియన్ పైగా వ్యూస్ సాధించి నెం.1 స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో ఈ సాంగ్ 2.5 బిలియన్‌తో 5వ స్థానంలో ఉండేది. నెల రోజుల్లోనే భారీగా వ్యూస్ సాధించి నెం.1 స్థానం దక్కించుకోవడం విశేషం.

సీయూ ఎగైన్

ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ యాక్ట‌ర్ పాల్ వాక‌ర్ కార్ యాక్సిడెంట్ లో చ‌నిపోయిన తర్వాత.... ఆయ‌న జ్ఞాప‌కార్థం ఈ వీడియో ను రూపొందించారు. ఏప్రిల్ 6, 2015 న ఈ వీడియో రిలీజ‌్ అవ్వగా....ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోకు 2.99 బిలియన్ వ్యూస్ (299 కోట్లకు పైగా ) వ్యూస్ వచ్చాయి.

నెం. 3 గంగ్నమ్

గంగ్న‌మ్ స్టైల్ వీడియోకు ఇప్పటి వరకు ఉన్న వ్యూస్ మొత్తం 2,921,304,945

నెం. 4

జస్టిన్ బీబర్ సారీ ఆల్బమ్ 2.6 బిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది.

నెం. 5

మార్క్ రాన్సన్ పాడిన అప్ టైమ్ ఫంక్ ఆల్బమ్ నెం.5 పొజిషన్లో ఉంది. ఈ పాటకు 2.5 బిలియన్ వ్యూస్ వచ్చాయి.

English summary
‘Despacito’ has broken the record for most viewed YouTube video of all time. The hit track by Luis Fonsi and Daddy Yankee was originally released in January 2017, but was later re-released in April with vocals from Justin Bieber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu