»   » యూట్యూబ్‌‌లో అత్యధిక మంది చూసిన ఆ వీడియో తొలగింపు, ఇది ఎవరి కుట్ర?

యూట్యూబ్‌‌లో అత్యధిక మంది చూసిన ఆ వీడియో తొలగింపు, ఇది ఎవరి కుట్ర?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూట్యూబ్ చరిత్రలో సంచలనం 'డిస్పసిటో' వీడియో ఆల్బం. ప్రముఖ పాప్ స్టార్ లూయిస్ ఫోన్సి రూపొందించిన ఈ వీడియో ప్రపంచ వ్యప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే ఈ వీడియో 5 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రపంచ రికార్డును నమోదు చేస్తూ 5 బిలియన్ మార్కును అందుకున్న ఈ వీడియో ఉన్నట్టుండి ఇపుడు యూట్యూబ్ నుండి మాయమైంది.

ఈ వీడియో తొలగింపు హ్యాకర్ల పనే అని అనుమానిస్తున్నారు. వీడియో ప్లే చేయడానికి ప్రయత్నించగా కొందరికి ముసుగు వేసుకున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఈ వీడియో ప్రపంచ రికార్డు సాధించడంతో ఓర్వలేకనే కొందరు దీన్ని హ్యాక్ చేసి తొలగించినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన యూట్యూబ్ టీమ్ ఈ వీడియోను రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Despacito: Most watched YouTube video ever deleted in apparent hack

స్పానిష్ లాంగ్వేజ్ హిట్ వీడియో అయిన 'డిస్పసిటో' 2017 జనవరిలో విడుదలైంది. అతి తక్కువ కాలంలో ఇతర రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ వీడియో విడుదలకు ముందు గంగ్నమ్ స్టైల్, సీయూ ఎగైన్, షేప్ ఆఫ్ యూ లాంటి వీడియోలు లీడింగులో ఉండేవి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే వీటన్నింటినీ వెనక్కి నెట్టేసింది.

టాప్ 5 పొజిషన్లో ఉన్న యూట్యూబ్ వీడియోల విషయానికొస్తే.... 5 బిలియన్ వ్యూస్‌తో 'డిస్పసిటో' మొదటి స్థానంలో, 3.5 బిలియన్ వ్యూస్‌తో 'సి యూ ఎగైన్' రెండో స్థానంలో, 3.43 బిలియన్ వ్యూస్‌తో షేప్ ఆఫ్ యూ మూడో స్థానంలో, 3.14 బిలియన్ వ్యూస్‌తో గంగ్నమ్ స్టైల్ నాలుగో స్థానంలో, 3 బిలియన్ వ్యూస్‌తో 'అప్‌టౌన్ ఫంక్' ఐదో స్థానంలో నిలిచింది.

English summary
Luis Fonsi's record-breaking video for "Despacito" appears to have been deleted from YouTube in an apparent hack. Just five days after it was announced that the video ft. Daddy Yankee had reached the remarkable milestone of becoming the first YouTube video in history to reach 5bn views, it disappeared.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X