»   » గ్రాండ్‌గా ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ.. ఇక విదేశీ చిత్రంలో మెరుపులా?

గ్రాండ్‌గా ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ.. ఇక విదేశీ చిత్రంలో మెరుపులా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు, దక్షిణాది హీరో ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికి బాలీవుడ్‌కే పరిమితమైన ధనుష్ కేరీర్ మరో అడుగు ముందు పడి హాలీవుడ్‌కి చేరింది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ అనే హాలీవుడ్ చిత్ర షూటింగ్‌లో ధనుష్ పాల్గొన్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఫకీర్ చిత్రంలో ధనుష్

ఫకీర్ చిత్రంలో ధనుష్

ప్రముఖ రచయిత రోమైన్ ప్యుర్టోలాస్ రచించిన అత్యంత ప్రజాదరణ నవల ఆధారంగా ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్ర షూటింగ్ ముంబైతోపాటు ప్యారిస్, బ్రస్సెల్స్, రోమ్ నగరాల్లో జరుపుకుంటుంది. ఈ చిత్ర కథ కొంచెం కామెడీ టచ్‌తోపాటు అడ్వంచరస్‌ అంశం కూడా ఉంటుంది. ఫ్రాన్స్‌కు చెందిన దర్శకుడు, గ్రాఫిక్ నావెలిస్ట్ మర్జానే సత్రాపీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బండిట్ క్వీన్ నటి సీమా బిశ్వాస్‌తోపాటు బెరెనిస్ బెజో, బర్ఖాద్ అబ్దీ, ఎరిన్ మెరియాటీ, లారెట్ లాఫిట్టీ నటిస్తున్నారు.

ధనుష్ గొప్ప నటుడు..

ధనుష్ గొప్ప నటుడు..

ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు మర్జానే మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో వైవిధ్యమున్న నటుల్లో ధనుష్ ఒకరు. ఆయనతో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఇండియాలో గొప్ప నటుడే కాకుండా హాటెస్ట్ స్టార్. గాయకుడు, నటుడు, డాన్సర్ ఇన్నీ అంశాలు ఉన్న వారు చాలా తక్కువగా ఉంటారు. అవన్నీ ధనుష్‌లో ఉండటం సంతోషంగా ఉంది అని అన్నారు.

బాలీవుడ్‌ను మెప్పించి..

బాలీవుడ్‌ను మెప్పించి..

గతంలో ధనుష్ బాలీవుడ్ చిత్రాల్లో నటించి అటు విమర్శకులను ఇటు ప్రేక్షకులను మెప్పించారు. 2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రాంజ్నా అనే హిందీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత 2014లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి షమితాబ్ అనే చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల అందుకొన్నప్పటికీ.. కమర్షియల్‌గా అంతగా విజయం సాధించలేదు.

పవర్ పాండీ ఘన విజయం..

పవర్ పాండీ ఘన విజయం..

తమిళంలో ఇటీవల పవర్ పాండీ అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించడమే కాకుండా ఓ పాత్రను కూడా పోషించారు. ఏప్రిల్లో విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఎనాయ్ నోకి పాయమ్ తోటా, వీఐపీ2, వాదా చెన్నై చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Dhanush begam filming on his Hollywood debut The Extraordinary Journey of the Fakir in Mumbai. The film, based on the best-selling novel by Romain Puertolas, is scheduled to be filmed in Mumbai, Paris, Brussels and Rome. The book itself is a globetrotting comedic adventure.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu