twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసు వసూళ్లు సాధిస్తున్న 'ఒబామా' వ్యతిరేక చిత్రం

    By Nageswara Rao
    |

    హూస్టన్: భారత సంతతికి చెందిన దర్శకుడు దినేష్ డిసౌజా రూపొందించిన బరాక్ ఒబామా వ్యతిరేక చిత్రం బాక్సాఫీస్ వసూళ్లను సాధించడంతో పాటు రికార్డుల్ని సృష్టిస్తుంది. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ చిత్రం, హాలీవుడ్ చిత్రాలకు దీటుగా భారీగా కలెక్షన్లు రాబడుతున్న టాప్ టెన్ సినిమాల్లో చోటు దక్కించుకుంది. '2016: ఒబామాస్ అమెరికా' పేరిట రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 24న 1091 థియేటర్లలో విడుదలైంది.

    2016 ఒబామాస్ అమెరికా టైటిల్‌తో విడుదలైన ఈ సినిమా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజకీయ వ్యూహాలను విమర్శిస్తూ... డాక్యుమెంటరీ సినిమాగా విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాని పదకొండు వందల థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. 90 నిమిషాలు నిడివి గల ఈ డాక్యుమెంటరీ సినిమా గత వారం చివరికల్లా అమెరికాలో 65 లక్షల డాలర్లు (రూ.36.17 కోట్లు), ఇతర ప్రాంతాలతో కలుపుకొని 1.03 కోట్ల డాలర్లు (రూ.57.32 కోట్లు)వసూలు చేసింది.

    ఈ సినిమాలో ఒబామాకు తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఒబామా బాల్య జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమాలో ఎక్కువ భాగం ఒబామా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేలా చిత్రీకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో, బరాక్ ఒబామా విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన ఈ సినిమా రిపబ్లికన్ పార్టీ క్యాంపైన్‌కు మంచి ఉత్సాహానిచ్చింది. ఈ చిత్రాన్ని రూపొందించిన డిసౌజా, గతంలో మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రభుత్వ హయాంలో పనిచేశారు.

    డిసౌజా రచించిన 'ది రూట్స్ ఆఫ్ ఒబామాస్ రేజ్' అనే పుస్తకం ఆధారంగా 'లవ్ హిమ్, హేట్ హిమ్. యూ డొంట్ నో హిమ్' అనే ట్టాగ్ లైన్ తో 'ఒబమాస్ అమెరికా' అనే చిత్రం ఒబామా రాజకీయ వ్యూహాలను ఆధారంగా రూపొందింది. జురాసిక్ పార్క్, షిండ్లర్ లిస్ట్ చిత్రాలను నిర్మించిన గెరాల్ మోలెన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    The movie “2016: Obama’s America” is a work of propaganda that offers base innuendo in lieu of argument, but the parts of it that are authentically engaging and account for its slender cinematic appeal likely have as much to do with the film’s popularity as its anti-Obama message does.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X