Don't Miss!
- News
వివేకా హత్యకేసులో సంచలనం- ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు: 11 గంటలకు..!!
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
అవతార్ దర్శకుడితో రాజమౌళి ముచ్చట్లు.. మరోసారి ఫ్యాన్ బాయ్ మూమెంట్
దర్శకదీరుడు రాజమౌళి RRR సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆస్కార్ వరకు ఈ సినిమా వెళ్లే దారిని ఏర్పరచుకుంటుంది. ఇక రాజమౌళి పలు ఇంటర్నేషనల్ అవార్డులలో పాల్గొంటూ అక్కడ ప్రముఖ హాలీవుడ్ దర్శకులను కలుసుకుంటున్నాడు. వారితో మాట్లాడుతున్న కొన్ని మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
కొన్ని రోజుల క్రితం రాజమౌళి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుకలో తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ని కలిశాడు. అతను గాడ్ అంటూ వివరణ ఇచ్చారు. ఎంతోమంది సినీ ప్రేమికులు రాజమౌళిని కలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ కలుసుకున్నప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రాజమౌళి కూడా అదే తరహాలో ఇప్పటికీ ఫ్యాన్‌బాయ్ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇక టైటానిక్ అవతార్ వంటి అనేక సినిమాల సృష్టికర్త డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ను కూడా రాజమౌళి కలిశాడు.

రీసెంట్ గా 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో పాల్గొన్న SS రాజమౌళి RRRకు సంబంధించిన ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అనే రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇక ఈ వేడుకలో ఆస్కార్ విజేత రాజమౌళిని కలిశాడు. రాజమౌళి సోషల్ మీడియాలో జేమ్స్ కామెరాన్‌ను కలిసిన ప్రత్యేక క్షణాన్ని పంచుకున్నారు. ఫొటోలను పోస్ట్ చేయడంతో పాటు, జేమ్స్ కామెరాన్ RRRని కూడా చూసినట్లు క్లారిటీ ఇచ్చారు.
సార్ మీరు మా సినిమాని విశ్లేషించడానికి మాతో మొత్తం 10 నిమిషాలు గడిపారని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. అంటూ అందరికి ధన్యవాదాలు అని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును మహేష్ బాబుతో తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకున్న రాజమౌళి మహేష్ సినిమాను మాత్రం ఊహలకందని స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో తెరపైకి తీసుకువస్తాడు అనిపిస్తోంది.