»   » ‘జంగిల్ బుక్’ టీజర్ రిలీజైంది

‘జంగిల్ బుక్’ టీజర్ రిలీజైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజల్స్: చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ అకట్టుకునే సాహసం, వినోదంతో 1967లో వాల్ట్‌ డిస్నీ 'జంగిల్‌ బుక్‌' అనే యానిమేషన్ చిత్రాన్ని నిర్మించింది. అప్పట్లో అది ఎంతో ఆదరణ పొందింది. ఇప్పటికీ టీవీ కార్యక్రమాల ద్వారా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 3డి లో సరికొత్తగా మరోమారు 'జంగిల్‌ బుక్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జోన్‌ ఫేవ్‌ర్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2016లో విడుదల కానుంది. తాజాగా వాల్ డిస్నీ సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన 6 సెకన్ల టీజర్ విడుదల చేసింది.

Mysteries await in The Jungle Book. 󾇓

Posted by Disney on Saturday, September 12, 2015

వాల్ట్ డిస్నీ సంస్థ తెరకెక్కిస్తున్న 'ది జంగిల్ బుక్'లో ప్రధాన పాత్ర మోగ్లీగా నటించే బంగారు అవకాశం న్యూయార్క్‌లో జన్మించిన భారతీయ - అమెరికన్ అయిన నీల్ సేథీని వరించింది. ''ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని వెతికాం. న్యూయార్క్ నుంచి న్యూజిలాండ్ వరకు, లండన్ నుంచి కెనడా వరకు, అమెరికా, భారతదేశం... మూలమూలలా వెదికిన తర్వాత పదేళ్ళ నీల్ సేథీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాం'' అని దర్శకుడు జాన్ ఫేవ్రౌ తెలిపారు.

అడవిలోని జంతువులు పెంచి పెద్ద చేసిన ఓ పసివాడి కథ ఆధారంగా సాగే చిత్రమే ‘ది జంగిల బుక్'. రుడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన 'ది జంగిల్ బుక్' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథ గతంలో యానిమేషన్ రూపంలో అలరించింది. కాగా, ఇప్పుడు లైవ్ - యాక్షన్, యానిమేషన్‌ల సమ్మిళిత రూపంగా 3డిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సేథీ ఒక్కడే మౌగ్లీగా నటిస్తున్నాడు. అతణ్ణి పెంచే అడవి జంతువుల పాత్రలన్నీ యానిమేషన్, గ్రాఫిక్సే. ఈ పాత్రలకు బెన్ కింగ్‌స్లే లాంటి ప్రసిద్ధులు గాత్రదానం చేయనున్నారు.

 Disney Drops 'The Jungle Book' Teaser Ahead of Trailer Release

నీల్ సేధీ మోగ్లీగా కనిపించనుంది. ఎమ్జే ఆంథోని...గ్రే బ్రదర్ పాత్రకు వాయిస్ ఇస్తారు. అలాగే బిల్ ముర్రే..భల్లూ పాత్రకు, బెన్ కింగ్ల్ లే...భగీరా పాత్రకు, ఇడ్రిస్ ఎలబా..షేర్ ఖాన్ పాత్రకు, క్రిష్టపర్ వాల్కన్ ..కింగ్ లూయీ పాత్రకు, స్కార్లెట్ జాన్ సన్..కా పాత్రకు, జింకార్లో ఎస్పిటో...అకేలా పాత్రకు, లుపిటా రక్ష పాత్రకు తమ వాయిస్ లు ఇవ్వనున్నారు. సినిమా ఏప్రిల్ 15, 2016లో విడుదల అవుతుంది.

English summary
Ahead of the official trailer of the much awaited Disney's "The Jungle Book", a short teaser has been released on Walt Disney's social media accounts. The 6 seconds long teaser takes fans into the jungle, journeying through the trees before showing a glimpse at Mowgli standing alone in the middle of the wilderness.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu