twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిరికి విమానం కథే... డిస్నీ కొత్త చిత్రం 'ప్లేన్స్‌'

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : ప్రముఖ నిర్మాణ సంస్ధ పిల్లల కోసం మరో చిత్రం రెడీ చేసి విడుదలకు సిద్దం చేస్తోంది. 'ప్లేన్స్‌' అనే టైటిల్ తో రూపొందిన ఈ త్రీడీ యానిమేషన్‌ సినిమా మన దేశంలోనూ భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ చిత్రం ఖచ్చితంగా పిల్లలను ఆకర్షిస్తుందని, పిల్లలతో పాటు థియోటర్స్ కి వచ్చిన పెద్దలు సైతం ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకుంటారని డిస్ని వారు గర్వంగా చెప్తున్నారు.

    అలాగే కథంతా విమానాల చుట్టే తిరుగుతుంది. హీరో కూడా ఓ విమానమే. విమానాలే డ్యూయట్లు పాడుకుంటాయి. ఇవే కళ్లూ, ముక్కూ, చెవులతో మనుషులను పోలి ఉంటాయి. దీంట్లో అసలు మనుషులే కనిపించరు. అయినా విమానాలతో కథేం ఉంటుందని మాత్రం అనకండి. అవే బోలెడు సాహసాలు చేస్తాయి, మాట్లాడుకుంటాయి. పైగా వాటి చేష్టలతో కడుపుబ్బా నవ్విస్తాయి కూడా అని చెప్తున్నారు.

    Planes

    ఇక ఈ చిత్రం కథేంటీ అంటే... డస్టీ అనే ఓ విమానం ఉంటుంది. ఈ సినిమాలో ఇదే హీరో అన్నమాట. డస్టీ ఓసారి విమానాల రేసు చూస్తుంది. అవన్నీ దూసుకెళ్లడం, పల్టీలు కొడుతూ పోటీ పడడం దానికి బాగా నచ్చుతుంది. అదీ వాటిలా రేసు హీరో అయిపోవాలని కలలు కంటుంది. కానీ డస్టీ రేసుల్లో పాల్గొనే విమానం కాదు. పైగా ఎక్కువ ఎత్తుకు వెళ్లడం అంటే దానికి తెగ భయం. అయినా అది లక్ష్యం వదులుకోదు. మరేం చేస్తుంది? స్కిప్పర్‌ అనే ఓ విమానం రేసుల కోసం శిక్షణనిస్తూ ఉంటుంది. దాన్ని కలిసి తన కల గురించి చెబుతుంది. ఇక సాధన మొదలెడుతుంది. చిన్నదే అయినా సాధన చేసి రాటుదేలుతుంది. కళ్లు చెదిరే వేగంతో దూసుకెళ్లడం నేర్చుకుంటుంది. మరి ప్రపంచంలోనే వేగవంతమైన విమానంగా ఎదిగిందా లేదా తెరపై చూడాల్సిందే.

    ఈ సినిమాలో దేశదేశాల విమానాల బొమ్మలు సందడిచేస్తాయి. అవన్నీ రంగురంగులలో రకరకాల వేషాలతో భలే ఆకర్షిస్తాయి. మన దేశం నుంచి కూడా రయ్యిమని వెళ్లే ఓ ఆడ విమానం ఉంటుంది. ఈ విమానానికి గాత్రాన్ని బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా అందించారు. విమానాలతోపాటు మరికొన్ని వాహనాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. అవన్నీ కూడా మాట్లాడుతూ సందడి చేస్తాయి. ఆకాశంలో అవి వేగంగా చక్కర్లు కొట్టడం వాటికి తోడు త్రీడీ మాయాజాలం కళ్లను కట్టిపడేస్తుంది.

    డిస్నీ వాళ్లు రూపొందించిన ప్లేన్స్‌ చిత్రం వీడియో గేమును కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఓ పోటీ కూడా పెట్టారు. అమెరికాలో జరిగిన ఓ విమానాల ప్రదర్శనకు పిల్లలను ఆహ్వానించారు. వాళ్లు విమానాలు బొమ్మల్ని గీసి ఇస్తే డ్రా తీశారు. అందులో విజేతలకు సినిమా టిక్కెట్లు, ఇంకా మంచి మంచి బహుమతులు ఇచ్చారు.

    English summary
    The movie Disney's Planes lands in theaters on August 9th, promising a high-flying film for the entire family. We had the opportunity to send our reporter, Bruce, to DisneyToon Studios to participate in a unique “Planes Day'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X