»   » ఇంట్రస్టింగ్ ట్రైలర్ ‌: వాల్ట్‌డిస్నీ కొత్త చిత్రం 'జూటొపియా' (వీడియో)

ఇంట్రస్టింగ్ ట్రైలర్ ‌: వాల్ట్‌డిస్నీ కొత్త చిత్రం 'జూటొపియా' (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ ‌: ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాల నిర్మాణ సంస్థ వాల్ట్‌ డిస్నీ నిర్మిస్తున్న చిత్రాలంటే పిల్లా, పెద్దా అందరికీ ఆసక్తే. చక్కటి కథలతో జంతువులను ప్రధాన పాత్రలు చేసి రూపొందించే చిత్రాలకు ప్రపంచం మొత్తం ఆదరణ ఉంది. దాంతో వారి కొత్త చిత్రం వస్తోందంటే అందరి చూపులూ అటు వైపే ఉంటాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా ఈ సంస్ధ 'జూటొపియా' టైటిల్ తో ఓ యానిమేషన్‌ చిత్రం ప్రారంభించింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ టీజర్ ను లాస్‌ఏంజెల్స్‌లో విడుదల చేశారు. బైరన్‌ హవార్డ్‌, రిచ్‌మూరేలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టీజర్ ని మీకు చూడాలని ఉందా..అయితే ఇక్కడ చూసేయండి.

ఈ సందర్భంగా కో-డైరెక్టర్‌ రిచ్‌ మూరే మాట్లాడుతూ.. రెండు జంతువుల (నక్క, కుందేలు) మధ్య సాగే హాస్య సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. మార్చి 4, 2016లో ఈ చిత్రం విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

Disney’s ‘Zootopia’ Trailer Introduces Animal-Run World

వాల్ట్‌డిస్నీ విషయానికి వస్తే...

వాల్ట్‌డిస్నీ 1901 డిసెంబర్ 5న చికాగోలో జన్మించాడు. ఇతడు చిన్నతనం నుండే చక్కగా బొమ్మలు గీసేవాడు. కొంతకాలం రెడ్‌క్రాస్ సంస్థలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత అలిస్కామెడీస్ అనే యానిమేషన్ చిత్రం నిర్మించాడు. దాంతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. 1932లో ప్లవర్స్ అండ్ ట్రీస్ అనే మొదటి కలర్ కార్టూన్ షో చేశాడు.

1937లో నిర్మించిన పూర్తి నిడివిగల యానిమేషన్ చిత్రం స్నోవైట్ అండ్ సెవన్ డ్వార్ప్స్‌తో వాల్ట్‌డిస్నీ సంస్థ యానిమేషన్ చిత్రాల ప్రస్థానం మొదలైంది. ఆయన తన చిత్రాలకు ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 26 అకాడమీ అవార్డులు గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. వాల్ట్‌డిస్నీ 1966 డిసెంబర్ 15న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు.

English summary
Walt Disney Animation Studios has released the first teaser trailer from its animated feature “Zootopia” nine months before its March 4 release. The comedy-adventure is directed by Byron Howard (“Tangled,” “Bolt”) and Rich Moore (“Wreck-It Ralph,” “The Simpsons”) and co-directed by Jared Bush (“Penn Zero: Part-Time Hero”).
Please Wait while comments are loading...