»   »  రాకింగ్ న్యూస్: ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇపుడు గర్భవతి!

రాకింగ్ న్యూస్: ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇపుడు గర్భవతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్టర్, మాజీ డబ్ల్యు డబ్ల్యు ఇ స్టార్ డ్వేన్ జాన్సన్ అలియాస్ ది రాక్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా గర్ల్ ఫ్రెండ్ లారెన్ హాసియన్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ తల్లిదండ్రులు అయ్యేందుకు గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నం ఫలించింది. లారెన్ గర్భం దాల్చిన విషయంతో పాటు, త్వరలో బేబీ గర్ల్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

Dwayne Johnson & Girlfriend Expecting Their First Child Together!

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోను డ్వేన్ జాన్సన్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసాడు. తన గర్ల్ ఫ్రెండ్ బేబీ బంప్ పై చేయి వేసి ప్రత్యేకంగా దిగిన ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసాడు. ‘ఇట్స్ ఎ బేబీ గర్ల్' అంటూ ఆ ఫోటోకు కాప్షన్ తగిలించడంతో ఆల్రెడీ లింగ నిర్దారణ పరీక్షలు కూడా చేయించినట్లు స్పష్టమవుతోంది.

తన అభిమనుకు థాంక్స్ చెబుతూ....‘నేను గత కొంత కాలంగా ఒక స్ట్రాంగ్ ఉమెన్ తో కలిసి జీవిస్తున్నాను. ఇద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. అభిమానుల ఆశీస్సులు కావాలి. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది' అని తెలిపారు.

Dwayne Johnson & Girlfriend Expecting Their First Child Together!


Image Courtesy : Instagram

43 ఏళ్ల ద్వేజ్ జాన్సన్‌కు మొదటి భార్య డేనీ గార్సియా ద్వారా గతంలో ఓ కూతురు జన్మించింది. ఆమె వయసు ఇపుడు 14 సంవత్సరాలు. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత డ్వేన్ జాన్సన్ లారెన్‌తో ప్రేమలో పడ్డాడను. చాలా ఏళ్లుగా ఇద్దరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

Dwayne Johnson & Girlfriend Expecting Their First Child Together!

డేనీ గార్సియాతో డ్వేన్ జాన్సన్ కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డాడు. 1997లో పెళ్లి చేసుకున్న వీరు దాదాపు పదేళ్ల పాటు కలిసి జీవించారు. 2008 విడిపోయారు. 2007 నుండి లారెన్ తో ప్రేమాయణం సాగిస్తున్న డ్వేన్ జాన్సన్ ఆమెతో కలిసి కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.

English summary
Dwayne Johnson, the 43 years old actor and former WWE champion is expecting his first child with girlfriend Lauren Hashian. The actor not only announced the news of their pregnancy, but also said that they are expecting a baby girl.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu