»   » గర్ల్ ఫ్రెండుతో సహజీవనం: బిడ్డకు తండ్రికాబోతున్న మరో స్టార్ హీరో

గర్ల్ ఫ్రెండుతో సహజీవనం: బిడ్డకు తండ్రికాబోతున్న మరో స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పెళ్లి కాకుండానే కలిసి జీవిచడం, బిడ్డను కనడం లాంటి మన టాలీవుడ్ చిత్రసీమలోనే చాలా కామన్ అయిపోయింది. ఇక హాలీవుడ్ స్టార్ల సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా హాలీవుడ్ స్టార్ ద్వేన్ జాన్సన్ అలియాస్ ‘ది రాక్' త్వరలో తండ్రి కాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ హాసియన్‌తో సహజీవను చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు.

43 ఏళ్ల ద్వేజ్ జాన్సన్‌కు మొదటి భార్య డేనీ గార్సియా ద్వారా గతంలో ఓ కూతురు జన్మించింది. ఆమె వయసు ఇపుడు 14 సంవత్సరాలు. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత డ్వేన్ జాన్సన్ లారెన్‌తో ప్రేమలో పడ్డాడను. చాలా ఏళ్లుగా ఇద్దరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. తమ ప్రేమకు గుర్తుగా బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు.

dwayne johnson

Image Courtesy of Twitter

అయితే లారెన్ గర్భం దాల్చిన విషయం ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ...ఇంటర్నేషనల్ మీడియాలో మాత్రం ఇందుకు సంబందించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి డ్వేన్ జాన్సన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

డ్వేజ్ జాన్సన్ సినిమాల విషయానికొస్తే ...ఈ ఏడాది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, సాన్ ఆండ్రియాస్ సినిమాలతో అలరించిన ఆయన ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ‘సెంట్రల్ ఇంటిలిజెన్స్', ‘మోవానా' అనే సినిమాల్లో నటిస్తున్నాడు.

English summary
Dwayne Johnson aka "The Rock" is expecting his first child with his longtime girlfriend Lauren Hashian. The San Andreas actor and is becoming a dad yet again with his girlfriend of nine years Lauren.
Please Wait while comments are loading...