»   » ప్రముఖ నటి ఇంట్లో విషాదం.. కత్తులతో దాడి.. దారుణంగా..

ప్రముఖ నటి ఇంట్లో విషాదం.. కత్తులతో దాడి.. దారుణంగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ హర్లీ కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. తన మేనల్లుడు మైల్స్ దారుణంగా కత్తిపోట్లకు గురయ్యాడు. తన సోదరి కేట్ కుర్రన్ కుమారుడైన మైల్స్ మోడల్‌గా రాణిస్తున్నాడు. గురువారం రాత్రి లండన్ వీధుల్లో కత్తిపోట్లకు గురవ్వడం సంచలనం రేపింది. ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఒంటిపై పలు కత్తిపోట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

Elizabeth Hurley’s 21-year-old nephew stabbed multiple times in London

తన మేనల్లుడు మైల్స్ దారుణంగా కత్తిపోట్లకు గురయ్యాడనే విషయాన్ని ఎలిజబెత్ హార్లీ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ సంఘటన గురువారం రాత్రి అస్కలాన్ స్ట్రీట్‌లో రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటుచేసుకొన్నది అని పోలీసులు ధృవీకరించారు. మైల్స్ దాడికి గురైనట్టు సమాచారం అందగానే వెంటనే స్పందించాం. వెంటనే అతడిని అంబులెన్స్‌లో తరలించాం అని వారు పేర్కొన్నారు. కొంతమంది అతడిపై దాడికి గురైనట్టు మా దృష్టికి వచ్చింది. వారి కోసం గాలిస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

English summary
Actor Elizabeth Hurley’s nephew Miles was stabbed multiple times in London.The 21-year-old model, who is the son of the actor’s sister, Kate Curran, was wounded multiple times on a street in London. The officials say the men are believed to have been “attacked by a group of males (no further details) who got out of a vehicle and assaulted them before fleeing the scene”. The investigation is underway.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu