»   » ఎయిడ్స్ భాదితులకై షో చేసిన 'గే' స్టయిలిష్ స్టార్..!!

ఎయిడ్స్ భాదితులకై షో చేసిన 'గే' స్టయిలిష్ స్టార్..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రిటీష్ కు చెందిన స్టైలిష్ గాయకుడు (స్టయిలిష్ స్టార్) సర్ ఎల్టన్ జాన్ ఎయిడ్స్ బాధితులకు సాయం చేసేందుకు ప్రీ ఆస్కార్ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 62 ఏళ్ల ఈ పాప్ సింగర్ ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో వార్తల్లో వుంటాడు. తనని తాను గే గా ప్రకటించుకొని గే అయిన ఓ సినీ నిర్మాత డేవిడ్ ఫుర్నిష్ ని పెళ్లిచేసుకున్న ఈయన ఇటీవలే జీసస్ క్రైస్ట్ ను గే అని అభివర్ణించి సర్వాత్రా విమర్శలపాలయ్యాడు.

ఇన్నాళ్లు ఏదో ఓ వెధవ పనితో వార్తల్లో నిలిచిన ఈయన ఇప్పుడో అభినందించదగ్గ పనితో వార్తల్లో నిలిచాడు. ఎయిడ్స్ బాధితుల సహాయార్థం ఆస్కార్ అవార్డులకు ముందు ఓ ప్రీ ఆస్కార్ పార్టీ ద్వారా ఫండ్స్ ను వసూలు చేయనారంభించాడు. ఇందులో మొత్తంగా 4 మిలియన్ పౌండ్ల వరకూ వసూలయిందని ఈ మొత్తాన్ని ఎయిడ్స్ బాధితుల కోసం వెచ్చిస్తానని ఆయన చెప్పాడు. అంటే స్టయిలిష్ స్టార్ ఇన్నాకో మంచి పనిచేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu