»   »  ట్రైలర్‌ రిలీజైన 24 గంటల్లో 30 లక్షల హిట్స్‌ (వీడియో)

ట్రైలర్‌ రిలీజైన 24 గంటల్లో 30 లక్షల హిట్స్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్‌: ఇప్పుడు సినిమా మీద క్రేజ్ ని ఏ విధంగా లెక్కేస్తున్నారంటే...ఆ ట్రైలర్ కు ఇరవై నాలుగు గంటల్లో వచ్చే వ్యూస్ లేదా హిట్స్ ని బట్టే అనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ట్ర్రైలర్ ని కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తు్న్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల ద్వారా దాన్ని మరింతగా ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఓ హాలీవుడ్ చిత్రం ట్రైలర్ విడుదలయ్యి... అదీ రికార్డ్ స్ధాయిలో హిట్స్ సొంతం చేసుకుని వార్తల్లో నిలించింది. ఇంతకీ ఏమిటా సినిమా అంటే....

టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వంలో రయిన్‌ రెనాల్డ్స్‌, మొరినా బొకారిన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'డెడ్‌పూల్‌'. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం యూట్యూబ్‌లో విడుదల చేశారు.

Deadpool

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

20వ సెంచరీ ఫాక్స్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ చిత్రం ట్రైలర్‌ను దాదాపు 35 లక్షల మంది వీక్షించారు. మీరూ ఈ ట్రైలర్ ని ఇక్కడ చూడవచ్చు.

హాలీవుడ్‌ సూపర్‌ మ్యాన్‌ సిరీస్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సూపర్‌ హీరోనే విలన్ తే... అనే నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం 2016 ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రం యూనిట్ వెల్లడించింది.

English summary
One of the show-stoppers of 20th Century Fox's big San Diego Comic-Con panel was the trailer for the X-Men spinoff film "Deadpool." Fans reportedly loved it - so much so that the trailer was shown twice! Tuesday night, the official trailer was released and it was quickly trending online.
Please Wait while comments are loading...