Fast and Furious 9 ఇండియాలో విడుదలకు సిద్ధం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో సినిమా చూసి గొప్ప అనుభూతిని ఎప్పుడెప్పుడు పొందాలా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా మెల్లమెల్లగా లాక్‌డౌన్ ఎత్తివేస్తుండటంతో థియేటర్లు రీ ఓపెన్ అయ్యేందుకు సానుకూలంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీక్వెల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.
హాలీవుడ్ నటుడు విన్ డిజిల్, మైఖేల్ రోడ్రిగ్స్ నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 చిత్రం భారత్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్నది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 5వ తేదీన థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో లాక్‌డౌన్ తర్వాత థియేటర్‌లో రిలీజ్ కాబోయే ఏకైక భారీ చిత్రంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 ఓ ప్రత్యేకతను సంతరించుకోనున్నది.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రం మొట్టమొదటి సారి 2001 రిలీజ్ అయింది. ఈ చిత్రం భారత్‌లో 5 బిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఫాస్ట్ ఫ్యూరియస్ 9 సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే అమెరికా, కెనడా, చైనా, రష్యా, కొరియా, హంకాంగ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాల్లో రిలీజ్ అయింది. భారత్‌లో లాక్‌డౌన్, కర్ఫ్యూ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో విన్ డిజల్, మిచెల్లి రోడ్రిగ్స్, టైరేసే గిబ్సన్, జోర్డానా బ్రిస్టెర్, క్రిస్ బ్రిడ్జెస్, తదితరులు నటించారు. ఈ చిత్రానికి జస్టిన్ లిన్ దర్శకత్వం వహించగా.. డేనియల్ కాసే స్క్రీన్ ప్లే అందించారు.


Click it and Unblock the Notifications











