twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' హీరో పాల్‌ వాకర్‌ మృతి..వీడియో

    By Srikanya
    |

    లాస్‌ ఏంజెలిస్‌: 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌ చిత్రాలతో పేరొందిన నటుడు పాల్‌ వాకర్‌ ఓ ప్రమాదంలో మరణించినట్లు ఆయన తరఫు ప్రచారకర్త ప్రకటించారు. లాస్‌ ఏంజెలిస్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన కారు ప్రమాదంలో 40 ఏళ్ల పాల్‌ వాకర్‌ మృత్యువాత పడ్డారని ప్రచారకర్త వాన్‌ ఇడెన్‌ ప్రకటించారు.

    లెన్సియా సమీపంలో జరిగిన ఘోరమైన కారు ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు కాగా ఇద్దరు వ్యక్తులు చనిపోయి వున్నట్లు సంఘటనా స్థలం నుంచి వచ్చిన వార్తలు తెలిపాయి. ఆ కారు నడుపుతున్న వ్యక్తి పాల్‌వాకర్‌ అని ఇడెన్‌ పేర్కొన్నారు. ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'అవర్స్‌' అనే చిత్రంలోనూ వాకర్‌ నటించారు.

    ఈ వార్త హాలీవుడ్‌ సినీ అభిమానుల్ని, పలువురు హాలీవుడ్‌ ప్రముఖుల్ని దిగ్భ్రాంతి పరిచింది. ప్రస్తుతం పాల్‌ వాకర్‌ 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 7' సినిమాలో నటిస్తున్నారు. 'హవర్స్‌' అనే సస్పెన్స్‌ డ్రామా చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెలలో విడుదలకు సిద్ధమైంది.

    సంఘన తాలూకు వీడియో లింక్...

    <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/m90yljF0KI0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

    ఆయన మృతిని తట్టుకోలేక కొందరు బాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్ చేసారు..అవి..

    అందులో కొన్ని... స్లైడ్ షోలో

    ప్రీతి జింటా

    ప్రీతి జింటా

    ''ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌'లో నటించిన పాల్‌ వాకర్‌ ఇకలేరు. యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన చూపించే ధైర్యం ఎందరికో స్ఫూర్తినిస్తుంది''

    సెలీనా జైట్లీ

    సెలీనా జైట్లీ


    ''ఆయన సినిమా పేరుకు తగ్గట్టే ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌గా దేవుడి దగ్గరకి వెళ్లిపోయారు. చిన్నవయసులోనే ఇలా అందరికీ దూరమవ్వడం విచారకరం''

    స్నేహా ఉల్లాల్‌

    స్నేహా ఉల్లాల్‌


    ''మరోసారి కారు ప్రమాదం నన్ను బాధలోకి నెట్టేసింది. నా సహ నటుడు (యశోసాగర్‌) కూడా ఇలాగే దూరమయ్యాడు''

    సిద్ధార్థ్‌

    సిద్ధార్థ్‌


    ''నలభయ్యేళ్ల వయసులోనే పాల్‌వాకర్‌ సినిమాకి దూరమయ్యారు. ఆయనతోపాటు ఆయన ధైర్యం, యాక్షన్‌ని కూడా కోల్పోయాం''

    సమంత

    సమంత

    తన ట్వీట్ లో సమంత ఈ హాలీవుడ్ నటుడుకి నివాళులు అర్పించింది. అంతేకాకుండా పాల్ వాకర్ ఆత్మకు శాంతి కలగాలని సోనాల్ చౌహాన్, అఫ్తాబ్ శివసాని, దియా మిర్జా, సోఫీ చౌదరి, బిజోయ్ నంబియార్ తదిరులు కోరుకున్నారు.

    ఇంకా...

    ఇంకా...


    పాల్ వాకర్ మరణ వార్తను ఇప్పటికీ నమ్మలేకున్నా . ఈ వార్త నన్నెంతో కలిచివేసింది. జీవితం చాలా విచిత్రమైనది అని వరుణ్ ధావన్ ట్వీట్ చేసారు. ఆయన ఆత్మకు శాంతి కలిగాలని ప్రార్ధించాడు. తెలివైన,అందమైన నటుడుని కోల్పోయామని మిఖా సింగ్ అన్నారు.

    హాలీవుడ్ లో ...

    హాలీవుడ్ లో ...

    అకస్మికంగా చోటు చేసుకున్న ఈ పరిణామణానికి హాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురైయ్యింది. 'వార్సిటీ బ్లూస్‌','ద ఫాస్ట్‌ అండ్‌ ఫూరియాస్‌' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాకర్‌ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. గత పద్నాలుగు సంవత్సరాల నుంచి తమ స్టూడియో ప్రతినిధులతో పాకర్‌ ఎంతో నమ్మకశక్యంగా ఉండే వాడని యూనివర్శల్‌ స్టూడియో పేర్కొంది. ఇతడు నటించిన హవర్స్‌ సినిమా ఈ డిసెంబర్‌ నెల లో విడుదల కానుంది.

    ఇలా జరిగింది...

    ఇలా జరిగింది...

    వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటా లోఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలీప్పిన్స్‌ తుపాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఓ కారు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో అతని స్నేహితు నితో కలిసి పోర్చ్‌ జీటీ కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వాకర్‌ ప్రతినిధి మీడియాకు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం వాకర్‌ కారు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఒక చెట్టుని ఢికొన్నదన్నారు. ఆ తరువాత కారులో చెలరేగిన మంటల్లో పాకర్‌ తో పాటు, అతని స్నేహితుడు కూడా మృతి చెందారన్నారు. వన్ ఇండియా తెలుగు ఈ నటుడుకి నివాళులు అర్పిస్తోంది.

    English summary
    Paul Walker has died in a car accident in Santa Clarita, California. The actor was 40. A statement says Walker was attending a charity event when the accident happened. Both he and his friend behind the wheel, Roger Rodas, lost their lives.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X