»   » లవర్స్ మెచ్చే బూతు, ఇండియాలో బ్యాన్: సీక్వెల్ వస్తోంది (ట్రైలర్ ఇదే)

లవర్స్ మెచ్చే బూతు, ఇండియాలో బ్యాన్: సీక్వెల్ వస్తోంది (ట్రైలర్ ఇదే)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే...వాలంటైన్స్ డే సందర్భంగా గతేడాది విడుదలై హాలీవుడ్ శృంగార భరితమైన ప్రేమకథా చిత్రం. హాలీవుడ్ హాట్ హీరోయిన్ డకోటా జాన్సన్, జామీ డోర్నన్ జంటా నటించిన ఈ రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ రొమాంటిక్ సీన్లతో ప్రేమికుల మధ్య మొగళిపొద రగిలేలా చేసింది.

వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ హాట్ మూవీ అమెరికా, బ్రిటన్, యూరఫ్ దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. 40 మిలియన్ డాలర్ల(రూ. 250 కోట్లు) బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 560 మిలియన్ డాలర్లు(రూ. 3300 కోట్లకు పైగా) వసూలు చేసింది.

అయితే ఈచిత్రం మన దేశంలో విడుదల కాలేదు. సెక్స్ కంటెంట్ తీవ్రంగా ఉండటంతో ఇండియాతో పాటు... మలేషియా, దుబాయ్, అరబ్ దేశాలు, కెన్యా, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేసారు.

టైటిల్ ‘ఫిప్టీ షేడ్స్ ఆఫ్ డార్కర్’ అని పెట్టేసారు

టైటిల్ ‘ఫిప్టీ షేడ్స్ ఆఫ్ డార్కర్’ అని పెట్టేసారు

ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ సారి టైటిల్ ‘ఫిప్టీ షేడ్స్ ఆఫ్ డార్కర్' అని పెట్టేసారు. ఇందులో కూడా డకోటా జాన్సన్, జామీ డోర్నన్ జంటగా నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే 3 మిలియన్ల మంది చూసారు. సీక్వెల్ మరింత హాట్ అండ్ సెక్సీ సీన్లతో ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇండియాలో ఎందుకు బ్యాన్ చేసారంటే...

ఇండియాలో ఎందుకు బ్యాన్ చేసారంటే...

గత సినిమాను ఇండియాలో ఎందుకు బ్యాన్ చేసారంటే...సినిమాలో ఎక్కువగా నగ్న సీన్లు ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి వాటికి స్థానం లేదు. ఈ చిత్రంలో హీరోయిన్ టాప్ లెస్ ప్రదర్శన ఉంది. సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరు.

రిలీజ్ అయ్యే అవకాశం లేదు

రిలీజ్ అయ్యే అవకాశం లేదు

సినిమాలో అభ్యంతర కర సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకే బ్యాన్ చేయక తప్పలేదు. ఈ సీక్వెల్ కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రేంజిలో ఉంది కాబట్టి ఇది కూడా ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం లేదు మరి.

మళ్లీ వాళ్లే టార్గెట్

మళ్లీ వాళ్లే టార్గెట్

ఈ సినిమా తీసేదే ప్రేమ జంటలను టార్గెట్ చేసుకుంది. ఇందులో ఉన్న సీన్లు సాధారణ జనాలకు బూతులా కనిపిస్తుంది... ప్రేమికులు మాత్రం రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ అంటూ పిలుస్తున్నారు. 2017వ సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సారి ఈ సినిమా ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో.

English summary
Jamie Dornan and Dakota Johnson return as Christian Grey and Anastasia Steele in Fifty Shades Darker, the second chapter based on the worldwide bestselling “Fifty Shades” phenomenon. Expanding upon events set in motion in 2015’s blockbuster film that grossed more than $560 million globally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu