For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఫైండింగ్‌ నిమో' 3D మన పిల్లలు కోసం కూడా...

  By Srikanya
  |

  హైదరాబాద్: 'ఫైండింగ్‌ నిమో' 3D ఇండియన్ లోకల్ లాంగ్వేజెస్ లోకి డబ్ చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆడుకోడానికి వెళ్లిన నిమో అనే ఓ బుల్లి చేపపిల్ల తప్పిపోతే , దాన్ని తండ్రి చేప వెతకడమే సినిమా అని పిల్లలు ఎవరికీ చెప్పక్కర్లేదు. దేశదేశాల్లో ఈ సినిమాని ఇష్టపడని పిల్లలు కానీ, పెద్దలు కానీ ఉండరని కచ్చితంగా చెప్పవచ్చు. అందుకు ఆ సినిమా సృష్టించిన సంచలనమే రుజువు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం డిస్నీ, పిక్సార్‌ యానిమేషన్‌ వాళ్లు తీసిన ఇది ఇప్పుడు మళ్లీ మన ముందుకు రాబోతోంది. సినిమా మొత్తాన్ని త్రీడీగా మార్చారు. ఇక థియేటర్‌లోకి వెళితే అందాల సముద్రగర్భంలో ఈదులాడినట్టే అంటున్నారు నిర్మాతలు.

  'ఫైండింగ్‌ నిమో'ను 2003లో 94 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ. 450 కోట్లకుపైగా వెచ్చించి తీస్తే, అది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 8000 కోట్లకుపైగా వసూలు చేసింది. దీనికి ఆస్కార్‌ అవార్డు కూడా లభించింది. సినిమా డీవీడీ విడుదల చేస్తే మూడేళ్లలోనే 4 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ప్రఖ్యాత అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు మేటి పది అత్యద్భుత యానిమేషన్‌ సినిమాల పట్టికలో ఒకటిగా దీన్ని గుర్తించారు.

  కథ విషయానికి వస్తే...సముద్రంలోని అందాల పగడాల తోటలో మార్లిన్‌, కోరల్‌ అనే చేపల జంట తమకు అప్పుడే పుట్టిన గుడ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే షార్క్‌ దాడి చేస్తుంది. దాని నోట పడి తల్లి కోరల్‌తో పాటు, ఒక్కటి తప్ప గుడ్లన్నీ నాసనమైపోతాయి. ఆ ఒక్క గుడ్డూ పిల్లగా మారితే తండ్రి మార్లిన్‌ దానికి 'నిమో' అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. ఓసారి నిమో నాన్న వద్దంటున్నా పైకంటా ఈదుకుంటూ పోవడం, అక్కడ అక్వేరియాల్లోకి చేపల్ని అమ్మే వాళ్లు పట్టేసుకోవడం జరుగుతాయి. అలా నిమో ఓ నగరంలోని అక్వేరియంలోకి చేరితే, తండ్రి మార్లిన్‌ కొడుకును వెతికే పనిలో పడతాడు. చివరికి తండ్రీకొడుకులిద్దరూ ఎలా కలిశారనేదే సినిమా.

  సముద్ర గర్భంలో కనిపించే అద్భుతమైన దృశ్యాలను, జలచరాలను ఇందులో ఎంతో చక్కగా చిత్రీకరించారు. ఇప్పుడా దృశ్యాలన్నీ త్రీడీలో మరింతగా అలరించనున్నాయి. సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేస్తుంటే చేపలు, షార్క్‌లు మన మధ్యనే ఈ దుతున్న అనుభూతి ఈ సినిమా కలిగిస్తుందని చెబుతున్నారు. ఇక్కడ కూడా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

  English summary
  Converting a hugely successful film into 3D is not always a safe game, simply because of the fact that technology changes with each passing point. The original ‘Finding Nemo’ was released in 2003, and now after 9 years the makers have come up with a 3D version of the film. Written and directed by Andrew Stanton, the film was a breathtaking tale of an abducted fish Nemo (Alexander Gould) and his father Marlin (Albert Brooks). The story featured the relationship of an overprotected child and his non risk taking father who develop their respective philosophies towards life in Sydney Harbour. The film was released by Walt Disney Pictures and produced by Pixar Animation Studious.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X