»   » హీరోయిన్ తండ్రి లింగ మార్పిడి, మహిళగా మారాడు (ఫస్ట్ లుక్)

హీరోయిన్ తండ్రి లింగ మార్పిడి, మహిళగా మారాడు (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అమెరికన్ టీవీ హీరోయిన్ కిమ్ కర్ధాషియాన్ సవతి తండ్రి బ్రూస్ జెన్నర్ లింగ మార్పిడి చేయించుకున్నాడు. మగాడిగా ఉండటం ఇష్టం లేక మహిళగా మారడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న బ్రూస్ జెన్నర్ తాను అనుకున్నది సాధించుకున్నాడు.

FIRST LOOK: Caitlyn Jenner (Bruce Jenner) As A Woman

మహిళగా మారాడు...కాదు కాదు మారింది. తన పేరును కూడా మార్చుకున్నారు. ఇపుడు ఆమె పేరు కైట్లీ జెన్నర్. అన్నట్లు ఇతగాడి వయసు.. కాదు కాదు ఈమె వయసు 65 సంవత్సరాలు. అయినా ఈ వయసులో ఇదేంటి? అనుకుంటున్నారా?...ఎవరి ఆనందం వారిది!

మాజీ అథ్లెట్ అయిన బ్రూస్ జెనెన్నర్.... హ్యాండ్సమ్ స్పోర్ట్స్ మెన్ లుక్ నుండి స్టైలిష్ ఉమెన్ లుక్ లోకి మారాడు. ఆపరేషన్ ద్వారా లింగ మార్పిడి చేసుకున్నారు. మాజీ మిస్టర్ బ్రూస్ జెన్నర్....ఇపుడు ఎంతో అందమైన మహిళగా పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. లింగ మార్పిడి ద్వారా వక్షోజాలు, ఇతర జననాంగాలు కూడా మార్పడి చేసినట్లు తెలుస్తోంది.

FIRST LOOK: Caitlyn Jenner (Bruce Jenner) As A Woman

‘వానిటీ ఫెయిర్' మేగజైన్ కవర్ పేజీ కోసం హాట్ హాట్ గా ఫోజులు కూడా ఇచ్చారు. ‘కాల్ మి కైట్లీ' అంటూ ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలు ప్రచురించారు. వానిటీ ఫేర్ మేగజైన్ కోసం కైట్లీ జెన్నర్ మీద ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ చూడొచ్చు.

English summary
After years of wait, Bruce Jenner is finally a woman and we have seen the first look of the transition on the cover of Vanity Fair. The former athlete has transformed himself from a handsome sportman to a stylish woman. Bruce has changed his name post the gender transitioning and is now, Caitlyn Jenner.
Please Wait while comments are loading...