»   »  దీపిక హాలీవుడ్ మూవీ 'XXX' ఫస్ట్ లుక్ ఇదే.. (ఫోటోస్)

దీపిక హాలీవుడ్ మూవీ 'XXX' ఫస్ట్ లుక్ ఇదే.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ‘XXX-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.

 First Look: Vin Diesel and Deepika Padukone in XXX!

ఆల్రెడీ దీపిక పదుకోన్ ‘XXX' మూవీ షూటింగులో జాయిన్ అయింది. ఇప్పటికే టొరంటోకు దీపిక వెళ్ళింది. ఈ నేపథ్యంలో తొలిరోజు షూటింగ్ సెట్స్‌లో దీపికా పదుకునే, విన్ డీజిల్ సన్నివేశాలు ఫస్ట్ లుక్ గా విడుదల చేసారు. విన్ డీజిల్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వార్ దీనిని పోస్టు చేశాడు. ఇందులో దీపికా సెరీనా అనే పాత్రలో, డీజిల్ జాండర్‌ అనే నటిస్తున్నారు.

ఆ మూవీకి డీజే కరుసో దర్శకుడు. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా సామ్యూల్ ఎల్ జాక్సన్, జెట్ లీ, టోనీ ఝా, కానోర్ మెక్ గ్రేగర్, రూబీ రోస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం దీపికా పదుకునే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో విన్ డీజిల్ కు పోటీగా నటించేందుకు దీపికా శిక్షణలో చాలా చెమటోడ్చింది. XXX సిరీస్‌లో వస్తున్న రెండవ మూవీ. 2017లో విడుదల కానుంది.

 First Look: Vin Diesel and Deepika Padukone in XXX!

షూటింగులో పాల్గొనడానికి ముందే దీపిక తన ట్విట్టర్ ద్వారా ఎగ్జైట్మెంటును బయట పెట్టింది. "హాలీవుడ్ ఎంట్రీపై నాకు ఎంతో ఉత్సాహంగానూ... టెన్షన్‌గానూ ఉంది. వచ్చేవారమే నా తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం వెళ్లబోతున్నా"అని దీపిక చెప్పిన సంగతి తెలిసిందే.

English summary
First Look of xXx: The Return of Xander Cage released. xXx: The Return of Xander Cage is an upcoming action film directed by D. J. Caruso starring Vin Diesel, Samuel L. Jackson, Jet Li, Tony Jaa and Conor McGregor. It is a sequel to the 2002 film xXx. The film will also feature Ruby Rose, Nina Dobrev, and Deepika Padukone as the three female leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu