»   » అమ్మో ఆ హీరోయినా పారితోషికం 25 కోట్లా..!?

అమ్మో ఆ హీరోయినా పారితోషికం 25 కోట్లా..!?

Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో నటించి ఒక్క సినిమాతోనే రాత్రిరాత్రి స్టార్ అయిపోయిన నటి ఫ్రిదా పింటో. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమె పారితోషికం చుక్కల్లో నిలిచింది. భారతదేశంలో ఏ నటీ అందుకోనంత పారితోషికాన్ని తన రెండవ సినిమాతోనే అందుకోబోతోంది. ఎంతేంటి అనుకుంటున్నారా..? అక్షరాల పాతిక కోట్లు. ఆమెకు ఇంత పారితోషికం అచ్చే నిర్మాత ఎవరని ఆశ్చర్యపోతున్నారా..? వారు భారతీయులు కాదులెండి ఓ హాలీవుడ్ సినిమా కోసం ఆమెకు ఈ పారితోషికం అందనుంది.

23వ బాండ్ చిత్రంలో బాండ్ గర్ల్ గా నటించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న ఫ్రిదా ఈ మొత్తం అందుకొనుంది. శ్యామ్ మెండీస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో డేనియల్ క్రెగ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ది క్వీన్ చిత్రానికి కథను అందించిన పీటర్ మోర్గాన్ ఈ బాండ్ సినిమాకు స్క్ర్రిప్ట్ ను అందించారు. మరో అమెరికన్ నటి ఒలీవియా వైల్డ్ మరో నాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఫ్రిదా మాట్లాడుతూ బాండ్ గర్ల్ గా ఎంపికయినందుకు ఎంతో సంతోషంగా వుంది. అదే సమయంలో ఉద్వేగానికి లోనవుతున్నాను అని చెప్పింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu