»   » 'బాండ్ గర్ల్' గా అరుదైన అవకాశాన్ని పొందిన 'భారతీయ నాయిక'

'బాండ్ గర్ల్' గా అరుదైన అవకాశాన్ని పొందిన 'భారతీయ నాయిక'

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న తార ఫ్రిదా పింటోను ఓ అద్భుతమయిన అవకాశం వరించింది. ఎంతో మంది హాలీవుడ్ భామలు కలలు కనే జేమ్స్ బాండ్ సరసన బాండ్ గర్ల్ గా నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. శ్యామ్ మెండీస్ దర్శకత్వంలో రూపొందనున్న 23వ బాండ్ చిత్రంలో ఈమె నటించనుందని సమాచారం. డేనియల్ క్రెగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో నాయిక ఎవరని చాన్నాళ్లుగా అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురు చూసారు. ఎట్టకేలకు ఈ పాత్రకు ఫ్రిదా పింటోను ఎంపికచేసారు.

ది క్వీన్ చిత్రానికి కథను అందించిన పీటర్ మోర్గాన్ ఈ బాండ్ సినిమాకు స్క్ర్రిప్ట్ ను అందించారు. మరో అమెరికన్ నటి ఒలీవియా వైల్డ్ మరో నాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఫ్రిదా మాట్లాడుతూ బాండ్ గర్ల్ గా ఎంపికయినందుకు ఎంతో సంతోషంగా వుంది. అదే సమయంలో ఉద్వేగానికి లోనవుతున్నాను అని చెప్పింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రిదా..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu