పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ’స్లమ్ డాగ్‘ ఫ్రైడా పింటో.. ప్రియుడితో బ్రేకప్.. ఆ తర్వాత వివాదంగా!
ఆస్కార్ అవార్డు గ్రహీత చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకొన్న ఫ్రైడా పింటో జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికాలో వ్యాపారవేత్త కోరీ ట్రాన్‌తో జీవితాన్ని పంచుకొంటున్న ఫ్రైడా పింటో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వపు అనుభూతితో ఆమె తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నది. ఈ సందర్భంగా ఆమె జీవితం, అలాగే పుత్రోత్సాహం గురించిన వివరాల్లోకి వెళితే...

స్లమ్ డాగ్ మిలియనీర్‌తో పాపులారిటీ
స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా పాపులారిటీ సంపాదించిన ఫ్రైడా పింటో కొద్దికాలం తన సహచరన నటుడు దేవ్ పటేల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అయితే వారి ప్రేమ పెళ్లి వరకు వస్తుందని అనుకొంటున్న సమయంలో బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత కోరీ ట్రాన్‌తో బంధం ఏర్పరుచుకొని 2019లో నిశ్చితార్థం జరుపుకొన్నది. ఆ తర్వాత 2020లో అమెరికాలోని హోండా సెంటర్‌లో వివాహం చేసుకొన్నారు.

గర్బవతిని అంటూ కొద్ది నెలల క్రితం
ఇలా తన వైవాహిక జీవితాన్ని ఆరంభించిన ఫ్రైడా పింటో ఇటీవల తాను గర్బవతిని అయ్యానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో తన స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు అందించారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని దీవెనలు అందించారు.

మాకు పండంటి బిడ్డ జన్మించారంటూ
ఇదిలా ఉండగా, తాజాగా తమ జీవితంలోకి చిన్నారి అడుగుపెట్టాడు. మాకు అబ్బాయి జన్మించాడు. అతడికి రుమీ రే అని పేరుపెట్టాం అంటూ ఫ్రైడా పింటో భావోద్వేగంతో పోస్టు పెట్టారు. తన భర్త ఛాతీపై పుడుకొన్న అబ్బాయి ఫోటోను, తన ఒడిలో పడుకొన్న చిన్నారి చిత్రాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఫైడా పింటో బిడ్డ పేరు ఏమిటంటే..
ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా స్పందిస్తూ.. హ్యాపీ బర్త్ డే దాదా కోరి. మా జీవితాల్లోకి నీవు ప్రవేశించిన సందర్భంగా ఘనంగా వేడుక జరుపుకొంటున్నాను. నీ పుట్టుక ద్వారా మీ నాన్న కేవలం తండ్రి కాలేదు. సూపర్ డాడ్ అయ్యారు. నన్ను ఎమోషనల్‌గా మార్చి సంతోషాన్ని అందించారు. తల్లిగా నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. రుమీ రే నువ్వంటే మాకు అద్వితీయమైన ఫీలింగ్ కలుగుుతున్నది అంటూ భావోద్వేగమయ్యారు.
Recommended Video

ఫ్రైడా పింటో సినీ కెరీర్ ఇలా..
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా తర్వాత రైస్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ తిష్నా, లవ్ సోనియా, మోగ్లీ: లెజెండ్ ఆఫ్ ది జంగిల్ , లవ్ వెడ్డింగ్, రిపీట్, హిల్‌బిల్ ఎలేజీ చిత్రాల్లోనటించింది. ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే.. ఫ్రైడా పింటో నీడిల్ ఇన్ ఏ టైమ్‌స్టాక్ అనే చిత్రంలో దర్శకుడు జాన్ రిడ్లీ డైరెక్షన్‌లో నటిస్తున్నారు. మిస్టర్ మాల్కమ్ లిస్ట్ అనే చిత్రంలో కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











