»   » అయ్యో ఆ వార్తల్లో నిజం లేదు..అన్నీ రూమర్సే

అయ్యో ఆ వార్తల్లో నిజం లేదు..అన్నీ రూమర్సే

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో పాపులర్ అయిన నటీమణి ఫ్రిదా పింటోకు జేమ్స్ బాండ్ సినిమాలో నటించే అరుదయిన అవకాశం వరించిందని అంతర్జాతీయ మీడియా కోడై కూసింది. ఇందులో నటించడానికి ఆమెకు 25 కోట్ల భారీ పారితోషికాన్ని అందిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ఫ్రిదా ఖండించింది. ఇంతవరకూ ఎవరూ తనని జేమ్స్ బాండ్ సినిమా కోసం సంప్రదించలేదని స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని స్వయంగా ఫ్రిదా పింటో వ్యక్తిగత కార్యదర్శి దివ్య మీడియాకు వెళ్లడించింది. ప్రస్తుతానికి బాండ్ సినిమాలో డ్యానియల్ క్రెగ్ సరసన నటించడానికి ఫ్రిదా ను ఎవ్వరూ సంప్రదించలేదు. కానీ ఈ వార్తలు ఎలా వచ్చాయో తెలియదు. ప్రస్తుతానికి ఫ్రిదాకు హాలీవుడ్ లో మంచి డిమాండ్ వుంది. దీంతో ఆమెకు చక్కని అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ పుకార్లు షికారు చేసుంటాయి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదయితేనేం బాండ్ గర్ల్ గా మన అమ్మాయి నటిస్తుందని సంతోషపడ్డ ఆమె అభిమానుల ఆనందం మీద ఈ వార్త నీళ్లు చల్లినట్టు వుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu