»   » సిగ్గూ ఎగ్గూ లేని ఆ టివి ఛానెల్ ను నిషేధించారు

సిగ్గూ ఎగ్గూ లేని ఆ టివి ఛానెల్ ను నిషేధించారు

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ ఫ్యాషన్ టివి ఎఫ్ ఛానెల్ ను భారతీయ ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు బహిష్కరించింది. గుడ్ టేస్ట్ అండ్ డీసెన్సీ పేరుతో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంలో అర్ధనగ్న ప్రసారాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమాలు పిల్లల లేతమనసు మీద దుష్ప్రభావాన్ని చూపుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడంతో ఈ ఛానెల్ ను తొమ్మిది రోజుల పాటు బహిష్కరిస్తున్నట్టు భారతీయ ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 12వ తేదీ రాత్రి 7 గంటల నుండీ మార్చి 21వ తేదీ రాత్రి 7 గంటల వరకూ ఈ ఛానెల్ ప్రసారాలు ఆగిపోనున్నాయి.

ఎఫ్ టివిని నిషేదించడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకు ముందు 2007వ సంవత్సరం ఎప్రిల్ 1వ తేదీన కూడా ఎఫ్ టివిని నిషేధించారు. మిడ్ నైట్ హాట్ అంటూ అప్పుడు వారు ప్రసారం చేసిన కార్యక్రమాలు పెనుదుమారాన్నే రేపాయి. దీంతో ఈ ఛానెల్ ను రెండు సంవత్సరాల పాటు నిషేధించారు. అయినా స్వామీజీ సెక్స్ స్కాండల్ అంటూ, వ్యభిచారం గుట్టురట్టు అంటూ స్థానిక న్యూస్ ఛానెళ్లు ప్రసారం చేసే జుగుప్సాకర వార్తల ముందు ఎఫ్ టివి దిగదుడుపే. అలాంటిది స్థానికి ఛానెళ్లను వదిలేయడం ఏమేరకు సమంజసమో ఆలోచించాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu