»   »  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7: ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7: ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలివుడ్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడే ఇండియన్ సినీ ప్రేమికులు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఏప్రిల్ 2న విడుదల కావడంతో సినీ అభిమానులంతా థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ చిత్రం గతంలో ఏ హీలీవుడ్ సినిమా సాధించని విధంగా తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్ సాధించింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు.

తొలి రోజు ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో ఇదే అత్యధిక వసూళ్లు. ఈ రోజు గుడ్ ఫ్రైడే హాలిడే కావడం, శని, ఆది వారాలు వీకెండ్ కావడంతో సినిమా వసూళ్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు.

Furious 7 Box Office: Highest 1st Day Opener In India

విన్ డీజెల్, డ్వేన్ జాన్సన్(ది రాక్), జాసన్ స్టాతమ్, పాల్ వాకర్ లాంటి స్టార్స్ నటించిన ఈ చిత్రానికి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో నటించిన హాలీవుడ్ స్టార్ పాల్ వాకర్ కారు యాక్సిడెంటులో మరణించడంతో సినిమా విడుదల ఆలస్యం అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. వసూళ్ల పరంగా ఈ చిత్రం 1 బిలియన్ డాలర్ల మార్కను అందుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలోని అద్భుతమైన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ చేస్తున్నాయి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే అభిమానులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.

English summary
Before the release of Furious 7, it was predicted that the movie will become one of the highest grossers of the year. Ever since the Fast and Furious franchise started, it has been increasing it's fan following and this seventh installment is all the more special as it is the last film of Paul Walker.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu