»   » ఇప్పటికిది ఐదో పెళ్ళి: షాక్ అవకండీ ఈ హీరో గురించి ఇవీ సంగతులు

ఇప్పటికిది ఐదో పెళ్ళి: షాక్ అవకండీ ఈ హీరో గురించి ఇవీ సంగతులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీన్‌ బియాన్‌ ఇలా పేరు చెప్పిన వెంటనే గుర్తు రాకపోవచ్చు గానీ 'లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌' చిత్రంలో బోరోమిర్‌గా కనిపించిన అతను 'గేమ్స్‌ ఆఫ్‌ ది థ్రోన్స్‌' సిరీస్‌లో నెస్డ్‌ స్టార్క్‌ పాత్రతో ప్రఖ్యాతి పొందాడు. త్వరలో రానున్న 'ద ఫ్రాంకెన్‌స్టీన్‌ క్రోనికల్స్‌'లో జాన్‌ మార్లట్‌ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇప్పుదు అర్జెంట్ గా ఈయన వార్తల్లోకి ఎలా ఎక్కాడూ అంటే.... 58 ఏళ్ల వయస్సులో ఇప్పుడు 5 సారి పెళ్ళి చేసుకున్నాడు మరి. అదీ తనకన్నా సగం వయస్సు తక్కువగా ఉన్న అమ్మాయిని...

గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌

గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌

"గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌" స్టార్‌ సీన్‌ బియాన్‌ మరోసారి పెళ్లి కొడుకు అయ్యాడు. 58 ఏళ్ల ఈ హాలీవుడ్‌ నటుడు తాజాగా ఐదోసారి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రియురాలైన 38 ఏళ్ల ఆష్లే మూర్‌ను వివాహమాడాడు. బియాన్‌ గతంలో డెబ్రా జేమ్స్‌, మెలానీ హిల్‌, అబిగెయిల్‌ క్రుటెండన్‌, జార్జినా సక్లిఫ్‌లను మనువాడారు.

ఐదో వివాహ వేడుక

ఐదో వివాహ వేడుక

కానీ ఈ నలుగురితో ఆయన వివాహబంధం ఎక్కువకాలం నిలువలేదు. ఆయనకు రెండో భార్యతో ఇద్దరు కూతుళ్లు, మూడో భార్యతో ఒక కూతురు ఉన్నారు. తాజాగా జరిగిన ఈ ఐదో వివాహ వేడుక అత్యంత సన్నిహితుల నడుమ అట్టహాసంగా జరిగిందని హాలీవుడ్‌ మీడియా తెలిపింది

డెబ్రా జేమ్స్

డెబ్రా జేమ్స్

కాగా, అంతకుముందు తొలిసారిగా 1981లో డెబ్రా జేమ్స్ అనే తన స్కూల్ స్నేహితురాలిని పెళ్లాడాడు. అప్పటికి అతడి వయసు 21 ఏళ్లు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన బీన్స్.. అక్కడే తన తోటి విద్యార్థిని మెలానీ హిల్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమెను 1990లో రెండో వివాహం చేసుకున్నాడు.

షార్ప్ అనే టీవీ సిరీస్‌

షార్ప్ అనే టీవీ సిరీస్‌

ఈ ఇద్దరు దంపతులకు ప్రస్తుతం లోర్నా (29), మోలీ (25) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. ఆ బంధమూ ఎక్కువ కాలం నిలవలేదు. ఏడేళ్లపాటు కలిసున్న వారు వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయారు. అనంతరం అక్కడి ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే షార్ప్ అనే టీవీ సిరీస్‌కు గెస్ట్‌గా వెళ్లిన అతడు..

అబిగైల్ క్రటెండెన్‌

అబిగైల్ క్రటెండెన్‌

ఆ సెట్లో తనకు పరిచయమైన అబిగైల్ క్రటెండెన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. 1997 నవంబర్‌లో వివాహబంధం ద్వారా వీరిద్దరు ఒక్కటయ్యారు. వారికి ఎవీ అనే కూతురుపుట్టింది. అయితే.. ఆ చిన్నారి నెలల వయసుండగానే వారిద్దరూ విడిపోయారు.

జార్జియానా సట్‌క్లిఫ్

జార్జియానా సట్‌క్లిఫ్

ఇక, నాలుగోసారి అతడు 2008లో పెళ్లి చేసుకున్నాడు. 2003లో పరిచయమైన జార్జియానా సట్‌క్లిఫ్ అనే నటిని రిజిస్టర్ మారేజ్ చేసుకున్నాడు. ఆ బంధమూ రెండేళ్ల కన్నా ఎక్కువ సాగలేదు. అనంతరం తన ఇక పెళ్లిచేసుకోబోనని, తోట పనులు చూసుకుంటూ కాలం గడిపేస్తానని 2011లో ఒక మాటిచ్చి ఇప్పుడు షష్టి పూర్తి దగ్గర పడగానే మళ్ళీ మాటతప్పేసాడు..

English summary
Game of Thrones star Sean Bean has tied the knot with girlfriend Ashley Moore. The actor, 58, got married for the fifth time on Thursday at a ceremony in Dorset.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X