»   » ‘గంగ్నమ్ స్టైల్’ స్టార్ నుండి మరో సాంగ్ (వీడియో)

‘గంగ్నమ్ స్టైల్’ స్టార్ నుండి మరో సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘గంగ్నమ్ స్టైల్' ఆల్బమ్ తో 2012లో కొరియన్ పాప్ సేన్సేషన్ సై(PSY) అంతర్జాతీయ మార్కెట్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. వందల కోట్ల మంది ఈ సాంగ్ చూసారు, ప్రపంచంలో ఈ సాంగు గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వీడియో షేరింగ్ సైట్ లో ఓ వీడియోను ఇంత స్థాయిలో చూడటం విశేషం.

కొంత కాలం పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గంగ్నమ్ స్టైల్ సాంగ్ ఫీవర్ కనిపించింది. ఈ సాంగులో డాన్స్ కూడా డిఫరెంటుగా ఉండటం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టార్లు కూడా మైదానల్లో గంగ్నమ్ స్టైల్ డాన్స్ చేయడంతో ఈ సాంగ్ పాపులారిటీ పీక్ స్థాయికి వెళ్లింది.

తాజగా గంగ్నమ్ స్టైల్ స్టార్ మరో సాంగ్ రిలీజ్ చేసారు. ‘డాడీ' పేరుతో నవంబర్ 30 రిలీజైన్ వీడియో సాంగ్ ను అప్పుడే యూట్యూబులో కోటి మందికి పైగా చూసారు. ఆ వీడియో సాంగుపై మీరూ ఓ లుక్కేయండి.

Gangnam Style Star PSY Back With New Music Video 'Daddy' Song
English summary
Watch Gangnam Style Star Back With New Music Video Daddy Song.
Please Wait while comments are loading...