twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవతార్ ప్రేరణతో 3-డిలో సరికొత్తగా ముస్తాబవుతున్న పాత సినిమాలు..!!

    By Kuladeep
    |

    'స్టార్ వార్' సినిమాను అభిమానించే ప్రేక్షకులకు ఓ శుభవార్త. మిమ్మల్ని ఎంతగానో అలరించిన ఈ సినిమా త్వరలోనే 3-డి పరిజ్ఞానంతో మీముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా స్టార్ వార్ సృష్టికర్త జార్జ్ లుకాస్ ప్రకటించారు. 1977లో వచ్చిన తొలి స్టార్ వార్ సినిమాను, ఆ తర్వాత ఈ సినిమాకు మూడు ప్రీక్వెల్లను తీసిన లుకాస్ ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి హాజరయినప్పుడు ఈ విషయాన్ని ప్రకటించాడు.

    "ఇటీవలే విడుదలయిన జేమ్స్ కామెరూన్ దర్శకత్వంల వచ్చిన అవతార్ సినిమా చాలా బాగుంది. అందులోని 3-డి ఎఫెక్ట్స్ నాకెంతగానో నచ్చాయి. ఇప్పుడు మళ్లీ నేను కొత్తగా 3-డి స్టార్ వార్ చిత్రాన్ని రూపొందించలేను కానీ ఇంతకు ముందు వచ్చిన స్టార్ వార్ సినిమాలను 3-డి పరిజ్ఞానంతో మార్పులు చేసి విడుదల చెయ్యాలనుకుంటున్నాను" అని లుకాస్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. 3-డి ఎఫెక్ట్స్ తో సినిమా అద్భుతంగా వుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఇటీవల 3-డి సినిమా ప్రేక్షకుల మీద దుష్ప్రభావాన్ని చూపుతోందని ఆరోపనలు వస్తున్న సంగతి తెలిసిందే. వారు ఈ ప్రతిపాదనను వ్యతిరేఖిస్తుండటం గమనార్హం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X