twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోల్డెన్ గ్లోబ్స్ 2021 నామినేషన్స్: భారతీయ సినిమాలకు తప్పని నిరాశ

    |

    సినిమా రంగానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే అవార్డుల్లో ఆస్కార్‌ ప్రతిష్టాత్మకమైనది. దాని తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా భావించేది గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులనే. ప్రతి ఏటా జనవరిలో ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. అయితే, ఈ సారి ఒక నెల ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 28న ఈ కార్యక్రమం న్యూయార్క్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం గోల్డెన్ గ్లోబ్స్ 2021 నామినేషన్స్ జాబితాను విడుదల చేశారు. ఇందులో భారతీయ చిత్రాలకు మరోసారి నిరాశే ఎదురైంది. మొత్తం 12 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు.

    తాజాగా విడుదల చేసిన నామినేషన్స్‌లో డేవిడ్ ఫించర్ 'మాంక్' ఆరు విభాగాల్లో, 'ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7' ఐదు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. అలాగే, 'ద ఫాదర్', 'ప్రామిసింగ్ యంగ్ ఉమెన్', 'నోమడ్‌లాండ్' నాలుగేసి విభాగాల్లో నామినేట్ అయ్యాయి. ఉత్తమ చిత్రం (డ్రామా) విభాగంలో 'మాంక్', 'నోమడ్‌లాండ్', 'ద ఫాదర్', 'ప్రామిసింగ్ యంగ్ ఉమెన్', 'ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7' స్థానం దక్కించుకున్నాయి. అలాగే, ఉత్తమ చిత్రం (మ్యూజికల్) విభాగంలో 'హమిల్టన్', 'మ్యూజిక్', 'పామ్ స్ప్రింగ్స్', 'ద ప్రామ్' చిత్రాలు నామినేట్ అయ్యాయి.

     Golden Globes 2021 nominations Announced

    ఉత్తమ నటి విభాగంలో 'వియోలా డెవిస్', 'ఆండ్రా డే', 'వన్నేశా కిర్‌బే', 'ప్రాన్సెస్ మెక్‌డొర్‌మాండ్', 'క్యారీ ముల్లింగన్' నామినేట్ అవగా.. ఉత్తమ నటుడు విభాగంలో 'రిజ్ అహ్మద్', 'చాద్‌విక్ బోస్‌మన్', 'ఆంటోనీ హోప్‌కిన్స్', 'గ్రే ఓల్డ్‌మెన్', 'తహర్ రహీమ్' ఎంపికయ్యారు. అలాగే, ఉత్తమ డైరెక్టర్ విభాగంలో 'ఎమోరాల్డ్ ఫెన్నెల్', 'డేవిడ్ ఫించెర్', 'రెజీనా కింగ్', 'అరోన్ సార్కిన్', 'చ్లోయీ జోహో' నిలిచారు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి ప్రదర్శితమైన 'తానాజీ', 'జల్లికట్టు', 'అసురన్', 'సూరారై పొట్రూ' సహా మిగిలిన చిత్రాలన్నింటికీ నిరాశే ఎదురైంది.

    English summary
    Spike Lee’s acclaimed war drama surprisingly did not receive a single nod. The film, about four Vietnam War veterans, received crazy good reviews and was also deemed timely due to its handling of race, and theatrical release not long after the George Floyd incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X