'జీవితంలో ఓ కల' ఆయనతో కలసి నటించాలని..
జస్టిన్ బైబర్ గర్ల్ ప్రెండ్ సింగర్ సెలీనా గోమెజ్ టైటానిక్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియోతో కలసి నటించాలని ఇటీవలే తన మనసులోని కొరికను బయట పెట్టింది. ఈ సందర్బంలో సెలీనా గోమెజ్ మాట్లాడుతూ నాకు తెలిసి నన్ను లియోనార్డో డికాప్రియో పిలిచి తనతో వర్క్ చేయమని మాత్రం అడగకపోవచ్చు. కానీ నేను మాత్రం నా జీవితంలో ఒక్కసారైనా లియోనార్డో డికాప్రియోతో కలసి పని చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఏ సమయంలోనైనా నాఅంతట నేను ఆయనని నాతో కలసి వర్క్ చేయమని అడగాలని అనుకుంటున్నానని అన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే సాల్మా హాయక్, నటాలీ పోర్ట్ మెన్‌లు వర్క్ మీద చూపే ఆసక్తి నాకు బాగా నచ్చుతుందని అన్నారు. ఇటీవలే నాకు సాల్మా హాయక్ నుండి ఓ ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ ఫోన్ కాల్‌లో సాల్మా హాయక్ నన్ను తనతో కలసి వర్క్ చేయమని అడగడం జరిగిందన్నారు. ఇక నటాలీ ఫోర్ట్ మెన్ ప్రగ్నెంట్ కాక ముందు నన్ను తనతో ఒక్కసారి కలవమని అనడం జరిగిందని తెలియజేసారు. సో దీనిని బట్టి తెలిసింది ఏమింటటే సెలీనా గోమెజ్ త్వరలో ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ నటాలీ ఫోర్ట్ మెన్‌తో కలసి నటించనుంది.


Click it and Unblock the Notifications











