For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న హాలీవుడ్ చిత్రం...డిటేల్స్

By Srikanya
|

న్యూయార్క్ : 58 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో సోనీ పిక్చర్స్‌ నిర్మించిన 'గూస్‌బంప్స్‌' చిత్రం మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. ఇప్పటివరకు 52.9 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. 'ది మార్షియన్‌' (The Martian) లాంటి భారీ బడ్జెట్‌ చిత్రం కన్నా ముందు వరుసలో నిలిచింది.

అమెరికాకు చెందిన ఆర్‌.ఎల్‌.స్త్టెన్‌ బాలల సాహిత్యంలో చేయి తిరిగిన రచయిత. 1992లో ఆయన 'గూస్‌బంప్స్‌' పేరుతో చిన్నారుల కోసం ఓ కథల పుస్తకం రాశారు. చిత్రవిచిత్రమైన జీవుల పాత్రలతో హారర్‌ నేపథ్యంలో రాసిన ఆ పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. 32 భాషల్లోకి అనువాదమైన ఆ పుస్తకం 35 కోట్ల కాపీలకు పైగా అమ్ముడుపోయింది. అందులోని పాత్రలకు పిల్లలు అభిమానులుగా మారిపోయారు. ఆ పాత్రల ఆధారంగా స్కాట్‌ అలెగ్జాండర్‌ అనే రచయిత 'గూస్‌బంప్స్‌' చిత్రానికి కథను సమకూర్చారు.

కాలక్షేపం కోసం కథలు చదువుదామని పుస్తకం తెరిస్తే... ఆ కథల్లోని పాత్రలు జీవం పోసుకుని ఛంగున మన ముందు దూకితే... అవి అచ్చం మనిషిలాగే మనతో మాటలు కలిపితే... మనతో చెట్టాపట్టాల్‌ వేసుకు తిరిగితే... వూహించుకోడానికే అద్భుతంగా ఉంది కదూ... ఆ వూహను నిజం చేసింది హాలీవుడ్‌ చిత్రం 'గూస్‌బంప్స్‌'. చిన్నారులనే కాదు.. ప్రతి మనిషిలోనూ దాగుండే చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర విశేషాలు మీకోసం...

కథేంటి: జాక్‌ కూపర్‌ అనే బాలుడు, అతని తల్లితో కలసి ఓ పట్టణానికి కొత్తగా వస్తాడు. వారి పక్కింట్లో షివర్స్‌, అతని కూతురు హన్నా ఉంటారు. వారిని పరిచయం చేసుకునేందుకు కూపర్‌ ప్రయత్నిస్తే, తమ నుంచి దూరంగా ఉండమని షివర్స్‌ హెచ్చరిస్తాడు. ఓ రాత్రి షివర్స్‌, హన్నా గొడవపడుతన్నట్లు వినిపించడంతో కూపర్‌ పోలీసులకు ఫోన్‌ చేస్తాడు. అవి టీవీ శబ్దాలని షివర్స్‌ పోలీసులకు చెబుతాడు. కూపర్‌ అనుమానంతో షివర్స్‌కు ఫోన్‌ చేసి పోలీసులా మాట్లాడి స్టేషనుకు రమ్మంటాడు. షివర్స్‌ వెళ్లగానే కూపర్‌ అతని ఇంట్లోకి వెళ్లి హన్నా కోసం వెతుకుతాడు.

‘Goosebumps’ and ‘The Martian’ Beat New Films at Box Office

అక్కడే అతనికి 'గూస్‌బంప్స్‌' పుస్తకం దొరుకుతుంది. దానికి తాళం వేసి ఉంటుంది. కూపర్‌ తాళాన్ని పగలగొట్టేసరికి పుస్తకం తెరుచుకుంటుంది. అందులోంచి పెద్ద వెలుగు వచ్చి, అక్షరాలన్నీ పైకి వచ్చేస్తాయి. అందులోంచి భారీ ఆకారంలో ఉండే కోతి బయటికొస్తుంది. ఇంటి తలుపులు పగలకొట్టుకుని బయటకు పారిపోతుంది. దాన్ని వెంబడించిన కూపర్‌, హన్నాలపై అది దాడి చేయబోతుంది. అప్పుడే అక్కడకొచ్చిన షివర్స్‌ వారిని రక్షించి ఆ కోతిని తిరిగి పుస్తకంలో బంధిస్తాడు. నిజానికి తన పేరు షివర్స్‌ కాదని, తాను 'గూస్‌బంప్స్‌' పుస్తక రచయిత స్త్టెన్‌ అన్న నిజాన్ని షివర్స్‌ కూపర్‌కు చెబుతాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిన్నప్పుడు తనను గేలి చేసే తోటిపిల్లల మీద కోపంతో తాను ఈ పాత్రలను సృష్టించానని, అయితే అవి జీవం పోసుకుని బయటకొచ్చాయని చెబుతాడు. వాటి అల్లరి భరించలేక అన్నింటినీ పుస్తకంలో బంధించానని చెబుతాడు. ఇంటికెళ్లేసరికి మరికొన్ని జీవులు బయటకొచ్చి ఉంటాయి. తమను బంధించాడన్న కారణంగా షివర్స్‌ మీద కోపంతో ఉంటాయి. షివర్స్‌ వాటిని మళ్లీ పుస్తకంలోకి పంపే ప్రయత్నం చేస్తే, అవి ఆ పుస్తకాన్ని తగలబెడతాయి. అన్నీ కలసి పట్టణం మీద పడి అల్లకల్లోలం చేస్తుంటాయి. వాటిని అదుపులోకి తీసుకోవాలంటే ఓ ప్రత్యేకమైన టైప్‌రైటర్‌లో మళ్లీ ఆ కథను రాయాలని షివర్స్‌ చెబుతాడు. ఆ టైప్‌రైటర్‌ను తీసుకొచ్చేందుకు కూపర్‌, హన్నా వెళతారు.

ఆ క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అయితే హన్నా కూడా ఆ కథలో ఓ పాత్ర అన్న విషయం కూపర్‌కు తెలుస్తుంది. మళ్లీ కథ రాసి ఆ పుస్తకంలో పాత్రలను బంధిస్తే, హన్నా తనకు దూరమవుతుందని కూపర్‌ బాధపడతాడు. అప్పుడు కూపర్‌ ఏం చేశాడు? హన్నా ఏమైంది? అన్న విషయాలను భావోద్వేగభరితంగా తెరకెక్కించారు దర్శకుడు బాబ్‌ లెటర్‌మాన్‌.

27 పాత్రల సృష్టి: త్రీడీ లైవ్‌ యాక్షన్‌ యానిమేషన్‌ విధానంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రధాన నటులు మినహా మిగిలి జీవులను గ్రాఫిక్స్‌ ద్వారా సృష్టించారు.

తోడేలు, రక్తపిశాచి, ఒంటికాలి దెయ్యం, పాము ఆకారంలో ఉండే మనిషి... ఇలా మొత్తం 27 రకాలు జీవులను రూపొందించారు. వీటితో పాటు కథ జరిగే పట్టణాన్ని కూడా సాంకేతికత సహాయంతో డిజైన్‌ చేశారు. అందుకు జార్జియాలోని మాడిసన్‌ పట్టణ స్వరూపాన్ని థియోడలైట్‌ పరికరం సహాయంతో సేకరించారు. ఆ డేటా ఆధారంగా కంప్యూటర్‌ తెరపై పట్టణాన్ని ఆవిష్కరించారు.

English summary
“The Martian” (20th Century Fox), which took in about $15.9 million, for a four-week total of $166.4 million, and “Goosebumps” (Sony), which collected $15.5 million, for a two-week total of $43.7 million, according to Rentrak, which compiles ticketing data.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more