twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ అవార్డులు: 'గ్రావిటీ' గెలిచింది

    By Srikanya
    |

    లాస్‌ఏంజిల్స్‌ : 86వ ఆస్కార్‌ పురస్కారాల వేడుక లాస్‌ఏంజిల్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తున్నారు. ఈ సారి గ్రావిటీ చిత్రానికి అవార్డుల పంట పండింది. జార్జ్ క్లూనీ, శాండ్రా బుల్లక్ నటించిన ఈ చిత్రం ఏకంగా ఐదు అవార్డులు సొంతం చేసుకుని దూసుకుపోతోంది. మరో రెండు విభాగాల్లోనూ పోటీ పడుతోంది.

     Gravity - Best Picture - Oscars 2014

    ఆ విభాగాలు...

    ఉత్తమ ఛాయాగ్రహణం చిత్రం : గ్రావిటీ
    ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ : గ్లెన్ ఫ్రీ మాంట్లే (గ్రావిటీ)
    ఉత్తమ సౌండ్ మిక్సింగ్ : స్కిప్ లీవ్ సే, నివ్ ఆద్రి (గ్రావిటీ)
    ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : టిమ్ వెబ్బర్, క్రిస్ లారెన్స్ (గ్రావిటీ)
    ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : (గ్రావిటీ)

    చిత్రం కథేమిటంటే.... అంతరిక్షయానానికి వెళ్లిన ముగ్గురు వ్యోమగాముల్లో ఇద్దరు ఓ ప్రమాదంలో మరణిస్తారు. మిగిలిన రియాన్‌ అనే మహిళా వ్యోమగామి తిరిగి భూమికి ఎలా చేరిందనేదే చిత్రకథాంశం. వ్యోమగామి రియాన్‌గా సాండ్రా బుల్లాక్‌ కనిపించింది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు అల్ఫాన్సో క్వురోన్‌.

    ఇక ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు పొందిన వ్యక్తులు..చిత్రాలు..

    ఉత్తమ నటుడు- లియోనార్డో డికాప్రియో(బ్రూస్)
    ఉత్తమ సహాయనటుడు- జారెడ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)
    ఉత్తమ సహాయనటి- లుపిటా యాంగో (12 ఇయర్స్ ఎ స్లేవ్)
    ఉత్తమ యానిమేషన్ చిత్రం- ఫ్లోజెన్

    English summary
    "Gravity" was also in its own stratosphere at the 86th annual Academy Awards, dominating the number count with seven Oscars - including a Best Director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X