సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటించడానికి సిద్దం అంటున్న మెరుపు తీగ
హాలీవుడ్ మెరుపు తీగ జేనిత్ పాల్ట్రో ఇటీవల కాలంలో ఓ మ్యూజికల్ కామెడీ డ్రామా 'గ్లీ' లో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ మ్యూజికల్ కామెడీ డ్రామాలో విల్ తో డేట్ చేసేటటువంటి క్యారెక్టర్ లో జేనిత్ పాల్ట్రో కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో టీచర్ కనిపించనున్నారు. జేనిత్ పాల్ట్రో ఇందులో రెండు ఎపిసోడ్స్ లో మాత్రమే పాల్గోంటారు.
జేనిత్ పాల్ట్రో ని మ్యూజికల్ కామెడీ డ్రామా పాల్గోనమని అడగగానే మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా జేనిత్ పాల్ట్రో వచ్చింది విల్ తో డేట్ చేయడానికి మాత్రమేనని ఈ షో నిర్వాహాకులు రేయన్ ముర్పే అన్నారు. ఇక్కడికి జేనిత్ పాల్ట్రో సెక్స్ ఎడుకేషన్ భోదించేటటువంటి టీచర్ గా వచ్చారు. దీని వలన జేనిత్ పాల్ట్రో 15, 16 ఎపిసోడ్స్ లో మాత్రమే వస్తారు. అంతేకాకుండా జేనిత్ పాల్ట్రో మనకి కేవలం మూడున్నర రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ షో షూటింగ్ అయిపోయిన తర్వాత జేనిత్ పాల్ట్రో తిరిగి మరలా తన సినిమా షూటింగ్స్ లలో పాల్గోంటారు.


Click it and Unblock the Notifications











